ఎస్పీ వసూల్ జిందాల్ ని కలిసిన హోంగార్డు అసోసియేషన్ సభ్యులు
న్యూస్‌తెలుగు/ విజయనగరం :ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్పీ వకుల్ జిందాల్ ని మంగళవారం జిల్లా హోంగార్డుల అసోసియేషన్, కో- అపరీటివ్ సొసైటీ తరపున మర్యాద పూర్వకంగా కలిసి అబినందలు తెలియిజేశామని హోం గార్డుల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పడగల బంగార్రాజు తెలిపారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ ఇటీవల నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వకీల్ జిందాల్ కి తమ సమస్యల్ని విన్నవించామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ, హోం గార్డుల సమస్యలు, కో- ఆపరేటివ్, సొసైటీ, సమస్యలు మీద, అతిత్వరలో చర్చించి చర్యలు తీసుకుంటామని, తగిన సూచనలు, సలహాలు ఇచ్చి, హోగార్డుల అభివృద్దికి కృషి చేస్తామని పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోం గార్డుల జిల్లా కో- ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పి.సుశీల, సబ్యులు, డైరెక్టర్ లు మహేష్, పతివాడ శంకర్రావు, రమణ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. (Story : ఎస్పీ వసూల్ జిందాల్ ని కలిసిన హోంగార్డు అసోసియేషన్ సభ్యులు )