మున్సిపల్ రెవెన్యూ ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు, సిబ్బంది కీలక పాత్రధారులే
మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
న్యూస్‌తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మున్సిపల్ రెవెన్యూ ఆదాయం పెంచుటలో అధికారులు సిబ్బంది కీలక పాత్రధారులు అని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులతో ఆస్తిపన్ను నీటి పన్ను సేకరణలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తక్కువ అంచనా వేసిన ఆస్తులను గుర్తించేందుకు సర్వే నిర్వహించాలని, ఆదాయ లీకేజీని నిరోధించేందుకు పన్నులు విధించాలని, పన్నుల సేకరణలో సామర్థ్యాన్ని తప్పక పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పన్ను సేకరణను సరళతరం చేయడంలో ఆదాయమును పెంచడంలో సమర్థవంతమైన పరిపాలనలో దోహదం అవుతుందని తెలిపారు. మొండి బకాయిల విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని తెలిపారు. (Story :మున్సిపల్ రెవెన్యూ ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు, సిబ్బంది కీలక పాత్రధారులే)