మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
సిఐటియు నాయకులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు నాయకులు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక పురపాలక సంఘం నందు కార్మికుల సమస్యలపై వివరించడం జరిగిందన్నారు. అనంతరం మున్సిపల్ కార్మిక సంఘం శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్.వెంకటేష్. లక్ష్మీనారాయణ. స్థానిక సిఐటియు నాయకులు జె.వి. రమణ.టి.అయూబ్ ఖాన్. స్థానిక మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు
ఎం.బాబు. ముకుంద మాట్లాడుతూ కరోణ సమయంలో తీసుకున్న కార్మికులందరినీ ఆప్కాస్ లో చేర్చాలి అని,పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని, చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చనిపోయినవారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. స్థానిక మూడోడివిజన్ నందు మస్టర్ పాయింట్ను ఏర్పాటు చేయాలన్నారు.
పి.ఎఫ్. ఈ ఎస్ ఐ. సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అని, కార్మికులకు అనుకూలంగా ఈఎస్ఐ హాస్పిటల్ ను ధర్మవరంలోనే ఏర్పాటు చేయాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
జె వి రమణ. మున్సిపల్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు.అయూబ్ ఖాన్. మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశులు. లక్ష్మీనారాయణ. ధర్మవరం మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు. బాబు, ముకుంద. లక్ష్మీ ఓబులేసు. కమిటీ నాయకులు. ప్రసాదు, రామకృష్ణ, ఆదినారాయణ, శ్రీనివాసులు, పెద్దక్క, సూర్యనారాయణ, రమేష్, చంద్ర, వెంకటేశులు, శ్రీనివాసులు. బాలమురళి, చెన్నకేశవులు, కార్మికులు పాల్గొన్నారు. (Story : మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి)