2029 నాటికి అందరికీ ఇళ్లు
న్యూస్‌తెలుగు / మచిలీపట్నం : రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ వచ్చే 2029 సంవత్సరం నాటికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం కంకిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలోని కంకిపాడు మండల హౌసింగ్ గోదామును మంత్రివర్యులు తనిఖీ చేశారు.
గోదాములో ఉన్న గృహ నిర్మాణ సామాగ్రి నిల్వ రిజిస్టర్లు, పంపిణీ రసీదులు, తదితర రికార్డులు పరిశీలించారు.
గోదాముకు ఎన్ని సిమెంట్ బస్తాలు వస్తున్నాయి, ఎన్ని టన్నుల స్టీల్ వస్తుంది, తలుపులు తదితర సామాగ్రి ఎంత మేరకు వస్తోంది ఎంతమందికి ఆ సామాగ్రిని పంపిణీ చేశారు తదితర వివరాలను మంత్రి హౌసింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కంకిపాడు గోదాముకు 1,16,881 బస్తాల సిమెంటు రాగా 1,16,182 బస్తాలు లబ్ధిదారులకు పంపిణీ చేశామని ఇంకా 699 బస్తాలు నిల్వ ఉన్నాయని అధికారులు మంత్రికి తెలిపారు.
అలాగే 8,13,290 కిలోల స్టీలు అందగా 6,83,692 కిలోల స్త్రీలు పంపిణీ చేయగా 1,29,598 కిలోల స్టీలు నిల్వ ఉందన్నారు. అలాగే త, విద్యుత్తు, రంగులు తదితర సామాగ్రి 300 రాగా అందులో 249 పంపిణీ చేశామని ఇంకా 51 సామాగ్రి నిల్వ ఉన్నాయని హౌసింగ్ అధికారులు మంత్రికి వివరించారు.
ఒక్కో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు 90 బస్తాల సిమెంటు, 485 కిలోల స్టీలు దశలవారీగా అందజేయడం జరుగుతుందనని, లబ్ధిదారులకు ప్రభుత్వ మంజూరు చేస్తున్న 1.80 లక్షల రూపాయల లో పట్టుకోవడం జరుగుతుందని హౌసింగ్ అధికారులు మంత్రికి వివరించారు.
గోదాముకు అందిన గృహ నిర్మాణ సామాగ్రి సజావుగా నమోదు చేసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, నిల్వ వివరాలు ఏమాత్రం తేడా లేకుండా రికార్డులు పక్కాగా నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు.
అనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో గృహ నిర్మాణం కోసం నిర్ణీత కాలవ్యవధి ప్రకారం లక్ష్యాలను నిర్దేశించామన్నారు.
ఆ ప్రకారం ఈ సంవత్సరం 1.25 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేయాలని, వచ్చే ఆగస్టు మాసాంతంలోగా 7 లక్షల గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఇదివరకే మంజులైన ఇల్లులను పూర్తి చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తామన్నారు.
లబ్ధిదారులు కూడా వారికి మంజూరైన ఇల్లులను వచ్చే మార్చి మాసాంతంలోగా పూర్తి చేసుకోవాలని లేకపోతే వారికి తదుపరి ఎటువంటి ఆర్థిక సహాయం అందించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే జిల్లాల వారీగా గోదాములను తనిఖీ చేసి అధికారులతో సమావేశాలు నిర్వహించి గృహ నిర్మాణ పురోగతిని సమీక్షించడం జరుగుతుందన్నారు.
కంకిపాడు గోదామును రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్ తో కలిసి తనిఖీ చేసి గృహ నిర్మాణ సామాగ్రిని పరిశీలించడం జరిగిందన్నారు.
పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ కొన్ని సూచనలు చేశారని వాటిని పరిగణలోనికి తీసుకుంటామన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో విఎంసీ ఇల్లు నాణ్యతగా లేవని తమ దృష్టికి వచ్చిందని రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ఇళ్ళ నాణ్యతను తనిఖీ చేస్తామని ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థకు బాధ్యతలు అప్పగిస్తున్నానున్నారు.
గృహ నిర్మాణం మేనేజింగ్ డైరెక్టర్ చే ప్రత్యేక మైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వం రాజకీయ కక్షతో టీడ్కో ఇళ్లను పూర్తిచేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందని దురుద్దేశంతో పూర్తి చేయలేదన్నారు.
ఈ సంవత్సరం టిడ్కో ఇళ్లను నూటికి నూరు శాతం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు.
ఈ తనిఖీలో మంత్రి వెంట రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మెయిదిన్ దివాన్, మేనేజింగ్ డైరెక్టర్ పి రాజాబాబు, ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, హౌసింగ్ సీఈ జి.వి.ప్రసాద్, ఎస్ ఈ లు జయ రామాచారి, నాగభూషణం కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల హౌసింగ్ పీడీలు జీవీ సూర్యనారాయణ, రజిని, ఉయ్యూరు ఆర్డిఓ డి. రాజు, మార్కెటింగ్ ఏడి నిత్యానందం, గృహ నిర్మాణ సంస్థ ఈఈ ఎస్ వెంకటరావు, డి ఈ శివప్రసాదరావు, ఏఈ అబ్దుల్ జిలాని తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు. (Story : 2029 నాటికి అందరికీ ఇళ్లు)