దోమల నివాణకు తరచుగా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేయండి
వీఎంసీ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర
న్యూస్‌తెలుగు /విజయవాడ : దోమల వల్ల కలిగే వ్యాధులను నియంత్రించటంతో పాటు దోమల ఉదృతిని అనిరట్టేందుకు తరచుగా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. కమిషనర్ నగర పర్యటనలో భాగంగా సోమవారం సర్కిల్`1 పరిధిలోని గొల్లపాలెం గట్టు, సర్కిల్`2 పరిధిలోని బుడమేరు కాలువ, సర్కిల్`3 పరిధిలో ఎన్టీఆర్ సర్కిల్, కనకదుర్గ నగర్, గుణదల వద్ద ఉన్న మేజర్ ఔట్ ఫాల్ డ్రెయిన్ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం గొల్లపాలెం గట్టు వద్ద జరుగుతున్న ఇంటింటి నీటి కుళాయి సర్వేను, బుడమేరు కాలువ వద్ద డ్రోన్ ద్వారా జరుగుతున్న ఎంఎల్ ఆయిల్ పిచకారి విధానాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్`3 పరిధిలోని ఎన్టీఆర్ సర్కిల్, కనకదుర్గ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, ఐలా, కార్పొరేషన్ సమన్వయంతో నగరపాలక సంస్థ హద్దుల్లో కూడా పారిశుధ్య నిర్వహణ పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కనకదుర్గ నగర్‌లో డ్రెయిన్లలో తరచుగా సిల్ట్‌ను తొలిగించటంతో పాటు దోమల నివారణకు డ్రోన్ ద్వారా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు దోమల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నిరంతరం ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేస్తుండాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో వీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ.రత్నావళి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, బయాలజిస్ట్ సూర్యకుమార్, అసిస్టెంట్ ఇంజనీర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు. (Story : దోమల నివాణకు తరచుగా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేయండి)