వర్షాకాలంలో వ్యాధుల పట్ల అప్రమత్తం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: వర్షాకాలంలో వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ (జూబ్లీ హిల్స్) సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్స్, నియోనాటాలజీ డాక్టర్ కే కృష్ణ స్వరూప్ రెడ్డి తెలిపారు. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్లకు ఆస్కారం ఉందన్నారు. దోమల ద్వారా, డెంగ్యూ (బ్రేక్ బోన్ ఫీవర్), చికున్‌గున్యా వ్యాధులు వస్తాయి. దోమలు లేకుండా చూసుకోవాలి. అలాగే, అపరిశుభ్రమైన ఆహారం, నీటితో అతిసారం వస్తుంది. కడుపు ఫ్లూ (వైరల్ గ్యాస్ట్రోఎంటెరిటిస్) అనేది కడుపు, ప్రేగులను ప్రభావితం చేసే అంటు వైరస్ ఇది. కలరా కలుషితమైన ఆహారం, పానీయాల ద్వారా వచ్చే విబ్రియో బ్యాక్టీరియా ఇది. టైఫాయిడ్ ఎస్ టైఫీ బాక్టీరియా.. ఇది సరిగా శుభ్రపరచని ఆహారం, పానీయాల నుంచి వస్తుంది. హెపటైటిస్ ఏ: మానవ వ్యర్థాలు, వ్యాధి సోకిన వ్యక్తి మూత్రంతో కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల వస్తుంది. లెప్టోస్పిరోసిస్ కలుషితమైన నీరు లేదా బురదలో జంతువుల ఉండటం మూలంగా మనుషులకు వ్యాపిస్తుంది. వైరల్ ఫీవర్ అలసట, కళ్లు తిరగడం, బలహీనంగా ఉండటం, చలి, కండరాలు, శరీరం, కీళ్ల నొప్పులు ఉంటాయి. ఫారింక్స్ వాపు ఉంటుంది. క్రమం తప్పకుండా స్నానం చేయాలి. గోళ్లను కత్తిరించుకోవాలి. వ్యక్తిగతంగా పరిశుభ్రతంగా ఉండాలి. ఉపరితలాలను శుభ్రపరచాలి. (Story : వర్షాకాలంలో వ్యాధుల పట్ల అప్రమత్తం)