షాహీన్ నగర్ మసీదులో ఏఎంపీఐ-హెచ్‌హెచ్‌ఎఫ్ ఆసుపత్రి
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఏఎంపీఐ-యూఎస్‌ఏ సహకారంతో షాహీన్ నగర్‌లోని మసీదులో జ్వరాలు, అంటువ్యాధుల చికిత్స కోసం ఏఎంపీఐ-హెచ్ హెచ్ ఎఫ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఇరవై పడకల ఈ ఆసుపత్రిలో ఐదు పడకలతో ఎమర్జెన్సీ క్యాజువాలిటీ కలదు. ఇది గుండెపోటు రోగులకు కూడా చికిత్స అందించనుంది. పరిశుభ్రత లోపం, స్వచ్ఛమైన తాగునీరు లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో టైఫాయిడ్, డెంగ్యూ, చికున్ గున్యా, డయేరియా వంటి అంటు వ్యాధులు తీవ్రంగా ప్రబులుతున్నాయి. వీటికి చికిత్స చేయడానికి ఇన్‌పేషెంట్ సౌకర్యం ఆవశ్యకత దృష్ట్యా మసీదు మొదటి అంతస్తులో రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. (Story : షాహీన్ నగర్ మసీదులో ఏఎంపీఐ-హెచ్‌హెచ్‌ఎఫ్ ఆసుపత్రి)