పెబ్బేరు మండల పోలీస్ వారి విజ్ఞప్తి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం ప్రజలకు, విద్యావంతులకు, యువతకు, అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి ఏమనగా గత కొంత కాలంగా మేము వివిధ రూపాలలో చెప్పినా కూడా ఎవ్వరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదుఅని పెబ్బేరు ఎస్ఐ హరి ప్రసాద్ రెడ్డి అన్నారు.
ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు, మైనర్ బాలలకు వాహనాలను ఇస్తున్నారు, ట్రిపుల్ రైడింగ్, అతివేగంగా అజాగ్రత్తగా వెళ్ళడం, రోడ్లపైనే ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలిపి సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు గురి చేస్తున్నారు. కనీస అవగాహన లేకుండా వాహనాలను నడిపి రొడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. కావున అందరికీ పోలీస్ వారి హెచ్చరిక లైసెన్స్ లేకుండా, నెంబర్ ప్లేట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ రైడింగ్, అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వంటి నేరాలు ఎవరు చేసినా అటువంటి వారు చట్టాన్ని అతిక్రమించినట్లుగా భావించి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్ లేని బండ్లను సీజ్ చేయడం జరుగుతుంది. కావున అందరికీ విజ్ఞప్తి చట్టాలను గౌరవించి అందరూ చట్టం పరిధిలో గౌరవంగా జీవించాలని అన్నారు. (Story : పెబ్బేరు మండల పోలీస్ వారి విజ్ఞప్తి)