మూవీ డైరెక్టర్ జానకిరామ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : గోపాల్ పేట్ మండల కేంద్రంలో హనుమాన్లగడ్డ చెందిన మూవీ డైరెక్టర్ కోమరి జానకిరామ్(44) ఆర్థిక సమస్యలతో గురై 05-08-2024 సోమవారం రోజున హైదరాబాదులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ విషయం తెలుసుకున్న గోపాల్ పేట్,రేవల్లి మండలాల ఇంచార్జ్ మందా సత్య శీల రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు నేరుగా జానకిరామ్ స్వగృహానికి వచ్చి తల్లి అనంతమ్మ ను ఓదార్చి భరోసా కల్పించి వారి కుటుంబ సభ్యుల మనో ధైర్యం కల్పించి తన వంతు గా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి అనంతమ్మకు 20,000/- అక్షరాల ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. జానకిరామ్ తమ్ముడు బాలకృష్ణ భావోద్వేగానికి గురై ఇంటి నుండి వెళ్లిపోయిన నేటి వరకు ఆచూకీ తెలియలేదు అని కుటుంబ సభ్యులు చెప్పారు.జానకిరామ్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని వారు చెప్పారు.ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు శివన్న,కేతేపల్లి వెంకటయ్య,కొంకలి మల్లేష్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్,తెలుగు బాలయ్య,కొంకలి రవి,కొంకలి వెంకటేష్,బైండ్ల భాస్కర్,చిన్న, శ్రీశైలం,కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : మూవీ డైరెక్టర్ జానకిరామ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి)