జష్న్-ఎ-ఆదాబ్ కల్చరల్ కార్వాన్ విరాసత్ అఖండ విజయం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: హైదరాబాద్‌లో కిక్కిరిసిన ఆడిటోరియంలో ప్రేక్షకుల ఆనందోత్సాహాల నడుమ జరిగిన సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-అదాబ్ కల్చరల్ కార్వాన్ విరాసత్ అపూర్వ విజయం సాధించింది. హిందుస్థానీ కళ, సంస్కృతి, సాహిత్యాన్ని వేడుక చేసుకునే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమాలలో ఒకటైన సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-ఆదాబ్ కల్చరల్ కార్వాన్ విరాసత్, సాంస్కృతిక మంత్రిత్వశాఖ (జిఓఐ), పర్యాటక మంత్రిత్వ శాఖ (జిఓఐ) సహకారంతో నిర్వహిస్తున్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ (మనూ) మద్దతుతో ఈ సాంస్కృతిక కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. పద్మశ్రీ ప్రొఫెసర్ అశోక్ చక్రధర్, మనూ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఐనుల్ హసన్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ సెయెద్ ఇ.హస్నైన్, తెలంగాణ కస్టమ్స్, జీఎస్టీ ప్రధాన కమిషనర్ సందీప్ ప్రకాష్, ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, ఆంధ్ర, తెలంగాణ మితాలి మధుమిత, జష్న్-ఎ-అదాబ్, అధ్యక్షుడు నవనీత్ సోనీ, కవి, సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-అదాబ్ వ్యవస్థాపకుడు కున్వర్ రంజీత్ సింగ్‌తో సహా విశిష్ట అతిథులు హాజరు కాగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. (Story : జష్న్-ఎ-ఆదాబ్ కల్చరల్ కార్వాన్ విరాసత్ అఖండ విజయం)