డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు ఎన్‌సిసి క్యాడేట్స్‌తో ఇంట్రాక్టివ్ సెషన్
న్యూస్ తెలుగు /విజయనగరం : సీతం ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో జరుగుతున్న కంబైండ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ లో సత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావుఎన్‌సిసి క్యాడెట్లతో నిర్వహించిన ఇంట్రాక్టివ్ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఎన్‌సిసి క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి దేశ అభివృద్ధిలో తన పాత్రను ఎలా గుర్తించాలో, అలాగే ఎన్‌సిసి క్యాడెట్లు దేశసేవలో కీలకమైన పాత్రను పోషించవలసిన బాధ్యతను వివరించారు. అనుభవాలను పంచుకోవడంతో పాటు, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, దేశసేవలో ఎన్‌సిసి పాత్ర వంటి ముఖ్యాంశాలను చర్చించారు. క్యాడెట్స్‌కి ఉత్తేజాన్ని అందిస్తూ, భవిష్యత్తులో దేశసేవకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఎన్‌సిసి క్రమశిక్షణ, నాయకత్వం, సామాజిక బాధ్యతలను ప్రాథమికంగా నేర్పడంతో పాటు, దేశ భవిష్యత్తు నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీతం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డివి రామ్మూర్తి, క్యాంప్ కమాండెంట్ తపస్ మండల్, డిప్యూటీ కమాండెంట్ పల్లవి వర్మ, సుబేదార్ మేజర్ అనిల్, అసోసియేట్ ఎన్‌సిసి అధికారులు మేజర్ శ్రీనివాసరావు, కెప్టెన్ సత్యవేణి, లెఫ్టినెంట్ కృష్ణ కిషోర్, లెఫ్టినెంట్ దినేష్, లెఫ్టినెంట్ లక్ష్మి, లెఫ్టినెంట్ ప్రశాంత్, సతీష్, సి ఎస్ ఓ కె. సత్యనారాయణ, పిడి మహేశ్వరరావు, ఎన్‌సిసి క్యాడెట్స్ పాల్గొన్నారు. (Story : డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు ఎన్‌సిసి క్యాడేట్స్‌తో ఇంట్రాక్టివ్ సెషన్)