జేఎస్డబ్ల్యూ ఎంజి మోటార్ మొదటి సియువికి విండ్సర్‌గా నామకరణం
న్యూస్‌తెలుగు/ముంబయి: జేఎస్‌డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా తమ రాబోయే మోడల్, భారతదేశపు మొదటి క్రాస్ ఓవర్ యుటిలిటి వెహికిల్ (సియువి)కి ‘విండ్సర్’ అని నామకరణం చేసింది. తెలివైన సియువి దిగ్గజపు నిర్మాణ కళాఖండం, రాచరికపు వారసత్వం చిహ్నం-విండ్సర్ కోట. దిగ్గజపు కోట వలే, ఎంజి విండ్సర్ సూక్ష్మమైన కళాపనితనం, శ్రేష్టత, రాచఠీవీల నిబద్ధతలకు ఉదాహరణగా నిలుస్తుంది. దీని గంభీరమైన డిజైన్‌తో, విండ్సర్ కోటకు ప్రతీకగా నిలిచే అదే స్థాయికి చెందిన ప్రీమియం నాణ్యత, విలాసాన్ని ప్రతిబింబించే కారు ప్రతి అంశం ఖచ్చితంగా రూపొందింది. శతాబ్దాల రాచరికపు చరిత్రలో లీనమై, ఈ దిగ్గజపు విండ్సర్ కోట రెండు ప్రపంచాలలోని ఉత్తమదనం ప్రదర్శిస్తుంది, చారిత్రక వైభవం, సమకాలీన సవరణలు పరిపూర్ణమైన మిశ్రమాన్ని సూచిస్తుంది. ఎంజి విండ్సర్ కూడా ఆధునిక టెక్నలాజికల్ ఆఫరింగ్స్‌తో క్లాసిక్ సొగసుదనం వ్యక్తం చేస్తుంది.