UA-35385725-1 UA-35385725-1

టీడీపీలోని పెద్ద చేపలకు గాలం!

టీడీపీలోని పెద్ద చేపలకు గాలం!

నూజివీడులో వ్యూహాత్మకంగా పావులు గదుపుతున్న వైసీపీ

ఈవీ శ్రీనివాస్ (న్యూస్ తెలుగు-చాట్రాయి) : నూజివీడు నియోజకవర్గంలో ఎన్నికలను వైసీపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతూ తెలుగుదేశం పార్టీలోని పెద్ద చేపలకు గాలం వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని విశ్వనీయ వర్గాల కథనం. రెండు దఫాలుగా నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నూజివీడు నియోజకవర్గం వైయస్సార్ పార్టీకి కంచు కోటగా మారింది. పెనమలూరులో వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి కేవలం కొద్ది రోజుల క్రితం టిడిపి తీర్థం పుచ్చుకొని నూజివీడు అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు మొదటి లిస్టులో పేరు ప్రకటించుకున్న‌ విషయం తెలిసినదే. వైసీపీ నుంచి బయటకు వచ్చిన సారధిని ఎట్టి పరిస్థితిలోనూ అసెంబ్లీలో కాలు మోపనివ్వకుండా ఉండేందుకు ఉన్న అన్ని అవకాశాల కోసం వైయస్సార్ పార్టీ గ్రామ మస్థాయిలో కూడా అణువణువు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే చాట్రాయి మండలంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకుడిని వైసీపీలోకి తీసుకురావడం మీకు ఇష్టమేనా అంటూ గ్రామ నాయకుల వద్ద వైసీపీ ఎన్నికల విభాగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఒక టీం ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రత్యేకమైన కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో స్థానిక నాయకులు టీంతో మాట్లాడుతూ… కొత్తగా వచ్చే వారి సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం వైసిపిలో వున్న చాట్రాయి మండల ఏక నాయకత్వం ఒంటెత్తు పోకడల వల్ల గ్రామాల్లో ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతున్న చిన్నం రామకోటయ్య వైపు వెళ్లిపోయారని, దానివల్ల పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని, అక్కడ జరుగుతున్న లోపాలను ముందు సవరించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీకి కంచుకోట అయిన చాట్రాయి మండలంలో పార్టీపై అసంతృప్తి పెరగడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపాలు అని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మండలంలో అత్యధిక శాతంగా బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న దళితులకు పార్టీలో సముచిత స్థానం గౌరవం లేదని కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గ్రామస్థాయిలో వున్న ప్రతి లోపాన్ని అధిగమించేందుకు వైసిపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ తెలుగుదేశం పార్టీలో ఉన్న చిన్న, పెద్ద నాయకులని అవకాశం ఉన్న మేరకు తనలో కలుపుకోవడానికి మండలంలో వైసిపి నాయకులను బుజ్జగిస్తూ…ఒప్పించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. (Story: టీడీపీలోని పెద్ద చేపలకు గాలం!)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1