నిస్వార్థ నాయకురాలు లోకం మాధవి
పలువురు ప్రముఖులు జనసేనలో చేరిక
విజయనగరం (న్యూస్ తెలుగు) : విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని మిమ్స్ హాస్పిటల్ కి చెందిన ఉద్యోగి అయిన అట్టాడ మహేష్ వారి అనుచర గణం ( కొండవెలగాడ పంచాయతీ) జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు, లోకం మాధవి సేవా గుణం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన, యువతకి బంగారు భవిష్యత్తు తేవాలనే తపన చూసి నేడు లోకం మాధవి ఆధ్వర్యంలో ముంజేరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అట్టాడ మహేష్ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి చెందాలంటే లోకం మాధవికి ఓటు వేసి గెలిపించాలని, నిస్వార్థ రాజకీయాలు లోకం మాధవితోనే సాధ్యమని తెలియజేశారు.
అలాగే డెంకాడ మండలం జొన్నాడ పంచాయతీకి చెందిన సుమారు 25 కుటుంబాలు లోకం మాధవి నాయకత్వంపై నమ్మకం ఉంచి ఈ రోజు ముంజేరు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారికి కండువాలు కప్పి మాధవి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. (Story: నిస్వార్థ నాయకురాలు లోకం మాధవి)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!