సీతంలో రాజ్యాంగం పై అవగాహన సదస్సు
విజయనగరం (న్యూస్ తెలుగు) : స్థానిక గాజులరేగ పరిధిలోగల సీతం ఇంజినీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ప్రస్తుత సమాజంలో వున్న రాజ్యాంగం పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక సంస్తాపకులు డా.బ్రహ్మా రెడ్డి వెన్నపూస ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిలో భాగంగా రాజ్యాంగం అనేది సర్వోతృష్ట చట్టం అని పేర్కొన్నారు. భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి రాజ్యాంగం ద్వారానే వచ్చిందని, 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక , ప్రజాస్వామ్య దేశంగా ఎదిగిందని తెలియచేశారు. మన దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి రాజ్యాంగ అమలు ఎంత వరకు దోహద పడుతుందని వివరించారు. ఈ కార్యక్రమం లో సీతం విద్యాసంస్థల డైరక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ రావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి, ఇ .సి. ఇ విభాగాధిపతి డాక్టర్ టి. డి.వి.ఎ.నాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జాతీయ విద్యా కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎ.వి రాజశేఖర్ పాల్గొన్నారు. (Story: సీతంలో రాజ్యాంగం పై అవగాహన సదస్సు)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!