డిసెంబర్ 26 2024 న భారత కమ్యూనిస్టు పార్టీ 100 శతవసంతాల ఆవిర్భావ వేడుక
న్యూస్ తెలుగు/వినుకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ వినుకొండ నియోజకవర్గ సమితి సమావేశం శివయ్య భవన్లో కామ్రే డ్ వూట్ల రామారావు అధ్యక్షత న జరిగింది. సమావేశంలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డిసెంబర్ 26 పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అన్ని గ్రామ శాఖలు మండలాలు పట్టణాలలో ఎర్రజెండా ఆవిష్కరణలు గావించి బ్యానర్లు తోరణాలతో అలంకరించి సభలు సమావేశాలు నిర్వహించి సిపిఐ భారతదేశంలో గత 100 సంవత్సరాలలో ఈ దేశంలో పేద బడుగు దళిత మైనారిటీ బలహీన అట్టడుగు వర్గాల హక్కుల కొరకు సాగించిన అనేక పోరాటాలు త్యాగాలు దేశంలో రైతాంగ సమస్యలపై కార్మికుల హక్కుల కొరకు సాగించిన పోరాటం సాధించిన విజయాలు ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు. సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ 5 మండలాలలోని పార్టీ సభ్యులు పార్టీ సభ్యత్వాన్ని డిసెంబరు నెలాఖరులోపు పునరుద్ధరించుకోవాలని, డిసెంబర్ 26 పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని శాఖలలో బ్యానర్లు తోరణాలతో పార్టీ పతాకాలు ఆవిష్కరించాలని డిసెంబర్ 26 పట్టణంలో జరిగే ర్యాలీ బహిరంగ సభలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ పట్టణంలోని 32 వార్డులలో పార్టీ సభ్యత్వం పునరుద్ధరించుకొని పార్టీ శాఖలలో జెండా ఆవిష్కరణలు తోరణాలు బ్యానర్ ల తో అలంకరించి జండాల ఆవిష్కరించాలని డిసెంబర్ 26 ర్యాలీ బహిరంగ సభలో పాల్గొనాలని ఆయన కోరారు.మండల కార్యదర్శులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు, పవన్ కుమార్, వూట్ల రామారావు, రాయబారం వందనం, ఏ ఐ టి యు సి నాయకులు బూదాల చిన్న, షేక్ కిషోర్, షేక్ కొండ్రముట్ల చిన్న సుభాని, చీరాల ఆంజనేయులు, సూర్య అప్పారావు, బి. పద్మ, షేక్ మల్లికా, రమణమ్మ, కాశమ్మ, షేక్ మస్తా న్, కె. మల్లికార్జున, దుర్గమ్మ, లలితమ్మ తదితరులు శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.(Story : డిసెంబర్ 26 2024 న భారత కమ్యూనిస్టు పార్టీ 100 శతవసంతాల ఆవిర్భావ వేడుక)