అమెరికాలో అదానిపై కోర్టులలో వేసిన కేసులపై
అదాని-జగన్ సోలార్ ఎనర్జీ ఒప్పందాలపై పార్లమెంట్లో జేపీసీ వేసి విచారణ చేయాలి.
ఈ డి సి బి ఐ లతో విచారణ జరపాలి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి
రాష్ట్రంలో అదాని కంపెనీలు చేసిన స్మార్ట్ మీటర్లు, సాయిబాబా ఏజెన్సీ లతో ఒప్పందాలను రద్దు చేయాలి
రాష్ట్రంలో ప్రజలపై పెంచిన 15 వేల కోట్ల రూపాయల కరెంటు ట్రూ అప్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి
మణిపూర్ రాష్ట్రంలో మైనారిటీ తెగలపై జరుగుతున్న మారణకాండపై పార్లమెంట్లో చర్చ జరగాలి జె. పి. సి విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలోని నియోజకవర్గ మండల కేంద్రాలలో 9, 10 తేదీలలో సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు డిమాండ్స్ డే, నిరసన కార్యక్రమాల పిలుపులో భాగంగా వినుకొండ పట్టణంలో ని శివయ్య స్తూపం వద్ద జరిగిన డిమాండ్స్ డే నిరసన కార్యక్రమానికి నియోజక వర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించి నిర్వహించగా కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నికల ప్రచారంలో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించుటకు పూర్తి బాధ్యత వహిస్తామని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రమే బాధ్యత వహిస్తుందని, రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి కల్పించి తోడ్పడుతామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపించారని, గత ఐదు సంవత్సరాలలో వైసిపి అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డితో అదానీ కంపెనీలు కుదుర్చుకున్న సోలార్ ఎనర్జీ ఒప్పందాలు అమెరికా కోర్టుల్లో కేసులు పెట్టబడి దేశం మొత్తం సైతం మీడియాలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయని, దీనిపై ప్రధాని మోడీ మౌనం వహించడం మోడీ అదాని జగన్ ల మధ్య సంబంధాలు ప్రజలకు అర్థమవుతున్నాయని. కావున రాష్ట్రంలో అదాని జగన్ ల మధ్య కుదిరిన సోలార్ ఎనర్జీ ఒప్పందాలను రద్దు చేయాలని దానిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో ప్రజల ఇళ్లకు స్మార్ట్ మీటర్ల ను బలవంతంగా బిగిస్తున్నారని ఈ స్మార్ట్ మీటర్లు కూడా అదాని కంపెనీలు తయారు చేసిన వేనని రాష్ట్రంలోని సాయిబాబా సంస్థల ద్వారా కరెంటు వినియోగదారులైన ప్రజలకు, వ్యవసాయ రంగంలో రైతుల పొలాల మీటర్లకు ఈ స్మార్ట్ మీటర్లను బిగించటం వలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిందని తెలిపారు. సెల్ ఫోనులవలే స్మార్ట్ మీటర్లకు కూడా రీఛార్జి కార్డులు పెట్టుకొని 100 యూనిట్లు, లేదా 200 యూనిట్లు రీఛార్జి కార్డులు కొనుక్కొని మీటర్లలో నమోదు చేసుకొనవలసి వస్తుందని రీఛార్జి టైంఅయిపోగానే కరెంటు ఆగిపోతుందని ఇది ప్రజలకు తీరని ఇబ్బందులను గురిచేస్తుందని కరెంటు చార్జీలు ప్రజలపై భారాలు మోపబడతాయని ఆయన విమర్శించారు. కావున ఈ విధానాన్ని ఆనాడు వ్యతిరేకించిన టిడిపి స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో ప్రజల పైన కరెంటు ట్రూ ఆఫ్ చార్జీలను వేసిందని ఆనాడు తెలుగుదేశం ప్రూఫ్ చార్జీలపై నిరసన తెలిపిందని మేము అధికారంలోకి వస్తే ప్రజలపై కరెంటు భారాలు వేయమని చెప్పి ఈనాడు కరెంట్ భారాలు 15 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలపై వేయడం అన్యాయమని ఈ కరెంట్ చార్జీలు ఉపసంహరించుకునే వరకు వామపక్షాలు పోరాడజరుగుతున్న అన్నారు. దేశంలో మణిపూర్ లో మైనారిటీ కుకీ ప్రజలపై జరుగుతున్న మారణకాండ పై చర్చ జరగాలని మణిపూర్ సంఘటనలపై పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన కరెంటు చార్జీలను తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి తో కుదుర్చుకున్న సోలార్ ఎనర్జీ ఒప్పందాలను రద్దు చేయాలని పేద ప్రజలకు రెండు సెంట్లు మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఐ నాయకులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు, ఓట్ల రామారావు, రాయబారం వందనం, షేక్ కిషోర్, పవన్ కుమార్, బూదాల చిన్న, కొండ్రముట్ల చిన్న సుభాని,చీరాల ఆంజనేయులు, సూర్య అప్పారావు, బి పద్మ, షేక్ మల్లికా రమణమ్మ, కాశమ్మ, కే. మల్లికార్జున, దుర్గమ్మ, లలితమ్మ మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.(Story : అమెరికాలో అదానిపై కోర్టులలో వేసిన కేసులపై)