దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేత
న్యూస్‌తెలుగు/వినుకొండ :- వినుకొండ నియోజకవర్గం టి. ఎన్. టి. యు. సి అధ్యక్షులు షేక్ అక్బర్ బాషా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మరియు డాక్టర్ అబ్దుల్ రజాక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనరు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పట్ల అవగాహన కలిగి ఉండాలని హెచ్ఐవి తో జీవిస్తున్న పిల్లలకు సమాజం తోడుగా ఉండాలని సూచించారు. చిన్నారుల పట్ల వివక్షత చూపకుండా వారిని సమాజంలో ఒకరిగా గుర్తించాలని అన్నారు. చిన్నారులు ప్రతి రోజు క్రమం తప్పకుండా మెడిసిన్ తీసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరిగి తమ యొక్క జీవిత కాలాన్ని పెంచుకోవచ్చని అన్నారు. ఎవరైతే వ్యాధి రుగ్మతలతో బాధపడుతున్నారో వారికి తమ సహాయాన్ని అందజేస్తానని మరియు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అక్బర్ బాషా మరియు వారి మిత్రబృందం లను ఆదర్శంగా తీసుకొని పిల్లలకు తగిన సహాయం చేయవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చికెన్ బాబు, సుభాని, కొండముట్ల సుభాని, బిస్కెట్ వలి తదితరులు పాల్గొన్నారు. (Story : దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేత)