Home టాప్‌స్టోరీ నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

0

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

నల్లగొండ బ్యూరో (న్యూస్ తెలుగు) : నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆరేన‌ని రాష్ట్ర మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆరోపించారు. న‌ల్గొండ జిల్లా పరిధిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి వెంకట్ రెడ్డీ మాట్లాడుతూ నల్గొండ జిల్లా కు కేసీఆర్ చేసింది ఏమీ లేదు జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్ అని అన్నారు. ఈ నెల 13 న నిర్వహించే సభలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండ రావాలి అని అన్నారు.ఎస్ఎల్బిసి ని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పాడు కాబట్టిసభలో నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ ప్రసంగించాలి అని హెచ్చరించారు.కేసీఆర్ మాట తప్పడం పై నల్గొండ టౌన్ లో సభ రోజు వినూత్న నిరసన చేస్తాం అని అన్నారు.కేసీఆర్ కోసం కుర్చీ ,పింక్ టవల్ ఎల్ ఈడి స్క్రిన్ ను పోలీసు పర్మిషన్ తో పెడతాం అని అన్నారు.రాష్ట్ర బడ్జెట్ ప్రజా యోగ్యమైందని తెలిపారు.కేఆర్ఎంబి ఫైళ్ల పై సంతకం పెట్టిందే కేసీఆర్, హరీష్ రావు అని గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు అని హెచ్చరించారు.బిఆర్ఎస్ ప్రభుత్వ అప్పులకు కూడా బడ్జెట్ కేటాయించాం అని తెలిపారు.కాళేశ్వరం మేడిగడ్డపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలి అని అన్నారు. (Story: నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్)

See Also: 

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version