వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో సత్య డిగ్రీ కళాశాల విద్యార్థిని ప్రతిభ
న్యూస్‌తెలుగు/ విజయనగరం : ఆంధ్ర విశ్వ కలాపరిషత్ తరపున సౌత్ వెస్ట్ జోన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో సత్య డిగ్రీ కళాశాల విద్యార్థికి బంగారు పతకం పొంది జాతీయ స్థాయికి ఎంపికయింది.సత్య డిగ్రీ & పీజీ కళాశాల విద్యార్థులు ఆంధ్ర యూనిర్సిటీ తరపున సౌత్ వెస్ట్ జోన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొని ఎస్ పల్లవి బంగారు పతకాన్ని 71 కేజీల విభాగంలో 90కేజీల స్నాచ్, 117 కేజీల క్లీన్ & జెర్క్ మొత్తం 202 కేజీల బరువును ఎత్తి సాధించింది. పల్లవి తో పాటు మరో ముగ్గురు విద్యార్థులు అంతర్ యూనివర్శిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి తెలియజేసారు. ఈ పోటీలు నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు లో నిర్వహించారు.ఏ. యశశ్రీ,. ఎస్. పల్లవి, బి.నీరజ , ఆర్. రాoబాబు వీరంతా జనవరి నెలలో హిమాచల్ ప్రదేశ్ లో జరిగే అంతర్ యూనివర్శిటీ పోటీలలో పాల్గొంటారు.ఈ సందర్భంగా కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు అభినందన సభలో మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు వారు ఎంచుకున్న రంగంలో మిక్కిలి నైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరుతూ విద్యార్థులకు నగదు బహుమతి మరియు జ్ఞాపికలను అందజేశారు.ఈ కార్యక్రమంలో శశి భూషణ రావు సతీమణి ఎం. అనురాధ, అబ్బాయి మిస్టర్ ఎం వివేక్ కళాశాల ఎన్ సి సి ఆఫీసర్ ఎం ఉదయ్ కిరణ్, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ బి సూరపు నాయుడు, ఫిజికల్ డైరెక్టర్ ఎస్ హెచ్ హెచ్ ప్రసాద్, కోచ్ చల్లా రాము పాల్గొన్నారు. (Story : వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో సత్య డిగ్రీ కళాశాల విద్యార్థిని ప్రతిభ)