పండుగ సాయన్న 134 వర్ధంతి
న్యూస్ తెలుగు/వనపర్తి : పాలమూరు ప్రజా వీరుడు తెలుగోల్ల ముద్దుబిడ్డ తెలంగాణ రాబిన్ తెలంగాణ పేద ప్రజలు ముద్దుగా పిలుచుకునే పండుగ సాయన్న గారి134 వర్ధంతి కార్యక్రమం వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్ రాజీవ్ చౌరస్తాలో పండుగ సాయన్న వర్ధంతి కార్యనిర్వాహక అధ్యక్షులు నందిమల్ల చంద్రమౌళి ఆధ్వర్యంలో కుల పెద్దలు బి సి ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చిన్న రాములు , తెలంగాణ ముదిరాజ్ రాష్ట్ర నాయకులు జింకల కృష్ణయ్య వనపర్తి పట్టణ మత్స్యకార సొసైటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు బి కృష్ణయ్య ముందేకోటి లక్ష్మయ్య ,పూల మాలను సమర్పించి కొబ్బరికాయలను కొట్టి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేట్ మండలం మెరుగుకొని పల్లె గ్రామంలో జన్మించిన అంతయ్య సాయమ్మ దంపతులకు సాయన్న జన్మించాడు స్వాతంత్ర ఉద్యమ కాలంలో నైజాం రజాకార్లు జమీందారులు జాగీర్ పెత్తందారుల దోపిడీ పీడనకు వ్యతిరేకంగా తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పెద్దలను కొట్టి పేదోళ్లకు పంచిపెట్టిన సాయన్న ఏ గ్రామంలోకి వెళితే ఆ గ్రామంలో సహపంక్తి భోజనాలు పేదలకు పెట్టేవారు సాయన్న ఏ గ్రామంలోకి వెళ్లిన పండుగ వాతావరణం సృష్టించేవారు అందుకే పరిసర ప్రాంత పేద ప్రజలందరూ కలిసి పండుగ సాయన్నగా బిరుదు అంకితం చేశారు నేటి యువత ఈనాటికీ గ్రామంలో పెత్తందారుల దౌర్జన్యాలు జరుగుచున్నందున తిరుగుబాటు చేసి గ్రామాలలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించుకోవాలి సింహాలు తమ చరిత్ర తాము రాసుకోకపోతే వేట కుక్కలు రాసిందే చరిత్రగా మనకు తెలుస్తుంది అని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చుక్కా రాజు సమాజ్వాది పార్టీ రాష్ట్ర నాయకులు జయరాములు గంగపుత్ర సేవ సమితి వనపర్తి పట్టణ అధ్యక్షుడు ఎర్ర మన్యం కాంగ్రెస్ నాయకులు రాగి వేణు బాలుటి బాలస్వామి జానంపేట శ్రీనివాసులు అడ్వకేట్ త్రినాథ్ చుక్క సత్యం చుక్క పెంటన్న డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు సంద రమేష్ B నాగేంద్రం రవి బజార్ యాధాకృష్ణ వి రామస్వామి v మన్యం v బిసన్న v అంజి గోకం భాస్కర్ గోకం బాలరాజు గోకం రాఘవేంద్ర రాయినపల్లి జింకల శ్రీను 23 ward కాంగ్రెస్ పార్టీ బోలెమోని నరసింహ ఊదరి రమణ శివ స్వామి గోకం అంజి అధ్యక్షులుజానంపేట నాగరాజు g నరసింహ వింధే కోటి రంగస్వామి తెలుగు మత్స్యకార సంఘం నాయకులు ముదిరాజ్ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.(Story : పండుగ సాయన్న 134 వర్ధంతి )