అసంఘటిత కార్యకలాపాలపై సహించేది లేదు రూరల్ సీఐబి లక్ష్మణరావు
న్యూస్ తెలుగు/విజయనగరం : అసంఘటిత కార్యకలాపాలపై ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని రూరల్ సిఐ బి లక్ష్మణరావు అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో విశాలాంధ్రతో మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న ఎటువంటి అసంఘటిత కార్యక్రమాలు పాల్పడిన వ్యక్తులపై ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తెలిపారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని వీటిపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి 11 గంటల దాటిన తర్వాత కారణం లేకుండా బయట తిరిగే వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ కు తెలపాలన్నారు. పేకాట కోడిపందాలు గ్రామాల్లో నిర్వహించే వారిపై దాడులు ముమ్మరం చేస్తామన్నారు. మాదకద్రవ్యాల వల్ల జరిగే అనర్థాలను గ్రామాల్లో ఉండే ప్రజలకు సైతం అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా యువతమాదక ద్రవ్యాల జోలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయరాదన్నారు. ప్రస్తుతం గంజాయి నిరోధించడంలో భాగంగా ప్రత్యేక బృందాలను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా దొంగతనాలను నిరోధించేందుకు గస్తీని ముమ్మరం చేశామన్నారు. ఎప్పటికప్పుడు వాహన తనిఖీలను నిర్వహిస్తున్నామన్నారు.(Story : అసంఘటిత కార్యకలాపాలపై సహించేది లేదు రూరల్ సీఐబి లక్ష్మణరావు )