పరిసరాల పరిశుభ్రతే ధ్యేయం
కొయ్యలగూడెం (న్యూస్ తెలుగు) : గ్రామ పరిశుభ్రతె ప్రధాన ధ్యేయమని పరింపూడి గ్రామపంచాయతీ సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి పేర్కొన్నారు. సమైక్య యూత్ ఆధ్వర్యంలో కొయ్యలగూడెం గ్రామ ప్రజల సహకారంతో గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్య అవసరాలు నిమిత్తం కొనుగోలు చేసిన నూతన ట్రాక్టర్ ను గ్రామపంచాయతీ సర్పంచ్ విజయ కుమారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని పారిశుధ్యం నిర్మూలన చేపట్టి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే తమ ధ్యేయమని అన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో గ్రామాల ప్రజలంతా చెత్తను డ్రైనేజీలలో, ఎక్కడ బడితే అక్కడ వేయకుండా పంచాయతీ ట్రాక్టర్ తమ వీధులలోకి వచ్చినప్పుడు ట్రాక్టర్‌పై చెత్తను వేయాలని , గ్రామం పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజా ఆరోగ్యాలు మెరుగుపడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాడికొండ. మురళీకృష్ణ, ముప్పిడి. చినబాబు, మట్ట శ్రీనివాస్, చెప్పుల మధుబాబు, ఏపూరి సతీష్, నక్క బాబి, మేడిన కన్నయ్య, మందపాటి రామకృష్ణ, మడుతూరి శ్రీనివాస్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. (Story: పరిసరాల పరిశుభ్రతే ధ్యేయం)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!