సత్య కళాశాలలో అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం
విజయనగరం (న్యూస్ తెలుగు) : స్ధానిక తోట పాలెంలో గల సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో బుధవారం అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. మొదటిగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసి మా తెలుగు తల్లి పాటను విద్యార్థులు ఆలపించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవమణి మాట్లాడుతూ, మన జీవితంలో మొదటగా నేర్చుకున్న భాష మాతృ భాష అని, తన తల్లిని ఎవరు చెప్పకుండా అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృ భాష కూడా అంతేనని, మాతృ భాష సహజంగా అబ్బుతుందని అప్రయత్నంగా వస్తుందన్నారు. అమ్మ మాటే మాతృ భాష అని అందుకే ప్రతి వారు అమ్మ ను కాపాడు కున్నట్లే మాతృ భాషను కూడా కాపాడుకోవాలన్నారు. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పు లేదని, అయితే వాటి ప్రభావం మాతృ భాషపై పడకుండా చూసుకోవాలనీ, మాతృభాషను పరిరక్షించుకోవాలన్నారు. ఈ కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవాన్ని జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story: సత్య కళాశాలలో అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!