ప్లాస్టిక్‌ను తగ్గిద్దాం
విజయనగరం (న్యూస్ తెలుగు): విజయననగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ యం.మల్లయ్య నాయుడు అన్నారు. బుధవారం కే ఎల్ పురం ప్రాంతంలో పలుచోట్ల పర్యటించారు. స్థానికంగా నెలకొన్న పారిశుధ్య పరిస్థితిని గమనించారు. అక్కడక్కడ డెబ్రీస్ గుట్టలుగా పడి ఉండడాన్ని చూసి సంబంధిత సిబ్బందిని హెచ్చరించారు. పేరుకుపోయిన చెత్తాచెదారాలు, డెబ్రీస్ వంటివి ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని చెప్పారు. అలాగే వీధులలో ఉన్న అల్పాహార దుకాణాలను గమనించారు. పాలిథిన్ సంచులలో టిఫిన్లను, వేడి వేడి పదార్థాలను వేయడానికి చూసి దుకాణదారులను మందలించారు. ఇకనుంచి వినియోగదారులకు పాలిథిన్ కవర్లలో వేడి పదార్థాలను వేసి ఇవ్వరాదని చెప్పారు. అలాగే కొనుగోలుదారులు కూడా టిఫిన్ బాక్సులు వంటివి తెచ్చుకొని ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు తాము కృషి చేస్తున్నామని, అయితే ప్రజా సహకారం కూడా ఇందుకు అవసరమని అన్నారు. పాలిథిన్ వాడకం వలన ప్రజారోగ్యం దెబ్బతినడమే కాకుండా, పర్యావరణం పై కూడా అధిక ప్రభావం చూపుతోందని అన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాలిథిన్ వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ సాంబమూర్తి, పారిశుధ్య పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. (Story: ప్లాస్టిక్‌ను తగ్గిద్దాం)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!