UA-35385725-1 UA-35385725-1

ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ లతో రైతులకు మేలు

ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ లతో రైతులకు మేలు

ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు

నరసాపురం (న్యూస్ తెలుగు): అన్నదాతలు నకిలీ విత్తనాలతో మోసపోకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ప్రభుత్వం నిర్మిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. బుధవారం స్థానిక అగ్రికల్చర్ మార్కెట్ యార్డు ఆవరణలో రూ.1.22 లక్షలు నాబార్డు నిధులతో నిర్మించిన డా: వైయస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ నాణ్యత పరీక్షలకు భరోసా కల్పిస్తాయని అన్నారు. ఇప్పటికె గ్రామీణ ప్రాంతాల్లో ఆర్బికేలు రైతులు కు సేవలు అందిస్తున్నాయని అన్నారు. నాసిరకం ఇన్ పుట్స్ బారిన పడకుండా ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది అన్నారు.
రైతులు సొంతంగా చేసుకున్న విత్తనాలు కాకుండా ఎరువులు, పురుగు మందులు, చేపలు ,రొయ్యలు చెరువులకు సంబంధించిన అన్ని రకముల టెస్టులను రైతులు ఉచితంగా పొందవచ్చు అన్నారు.
రాష్ట్రంలో మొదటిసారిగా నరసాపురం నియోజకవర్గంలో సుమారు రూ.1.50, కోట్లతో అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ నిర్మించుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ భవనములో విత్తనములు, ఎరువులు, పురుగు మందులు, టెస్టులు చేసేలా గ్రౌండ్ ఫ్లోరు, చేపలు, రొయ్యలు చెరువుల కు సంబంధించిన టెస్టులు చేసేలా మొదటి అంతస్తు నిర్మించడం జరిగింది అన్నారు. గతంలో రైతులు భూసార పరీక్షలు చేయుటకు డబ్బులు ఖర్చు చేసుకునే వారన్నారు, ఇకపై ఎటువంటి ఖర్చు లేకుండా ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ల ద్వారా భూసార పరీక్షలు ఉచితంగా పొందవచ్చని అన్నారు.
ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అన్ని విధాల ప్రోత్సాహాలను అందిస్తుందని అన్నారు. రూ:13,500, రైతు భరోసా, బ్యాంకుల ద్వారా సున్నా వడ్డీకే రుణాలు, ఇన్ పూట్స్ సబ్సిడీ, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వెనువెంటనే స్పందించి రైతులను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు రైతుకి ఇంత ప్రాధాన్యతను ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లను రైతులు సద్వినియోగం చేసుకుని కొత్త నైపుణ్యంతో అధునాతన పద్ధతులను ప్రారంభించి వ్యవసాయం లో లాభసాటి పొందాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గుబ్బల రాధాకృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె
శ్రీవెంకటరమణ, జెడ్పిటిసిలు బొక్క రాధాకృష్ణ, తిరుమని బాపూజీ, ఎంపీపీ మైలా బత్తుల సోనీ, వైస్ ఎంపీపీ ఉంగరాల రమేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. (Story: ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ లతో రైతులకు మేలు)

See Also: 

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1