కడియద్ద గ్రామంలో శ్రీవాసవి ఎన్ఎస్ఎస్.శిబిరం
తాడేపల్లిగూడెం (న్యూస్ తెలుగు) : శ్రీవాసవి ఇంజనీరింగ్ కళాశాల ఎన్. ఎస్. ఎస్.విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే జాతీయ సేవా పథకం శిబిరాన్ని కడియద్ద గ్రామంలో మంగళవారం కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కడియద్ద గ్రామ పంచాయితీ కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సేవా పథక శిబిరాన్ని నిర్వహించి మొదటి రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా గ్రామ ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించి చైతన్య పరచడం అభినందనీయమన్నారు. సేవా పథక శిబిరం కోసం మా గ్రామాన్ని ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు.
శ్రీవాసవి కళాశాల విద్యార్థులు గ్రామం సచివాలయం పరిసరాలలో చెత్తచెదారాలను ఏరి వేసి శుభ్రపరిచి గ్రామ ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించి పరిశుభ్రతను పాటించి ఆరోగ్యంగా ఉండాలని తెలియ జేశారు. గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్ధాలు వివరించారు. హాండీ క్రాఫ్ట్స్ తయారు చేసే విధానం గురించి తెలియ జేశారు. కార్యక్రమంలో
శ్రీవాసవి ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులతో పాటుఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఎన్ రాజశేఖర్, ఆర్ ఎల్ లోకేష్ బాబు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూర్తి, ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్, గ్రామ వి ఆర్ ఓ ఆదంరాజు, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ సుధాకర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. (Story: కడియద్ద గ్రామంలో శ్రీవాసవి ఎన్ఎస్ఎస్.శిబిరం)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!