ప్రజల ఆకాంక్షలకు ఆనుగుణంగా సేవలు
జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన
న్యూస్ తెలుగు/విజయవాడ : ప్రజల ఆకాంక్షలకు ఆనుగుణంగా సేవలు అందిస్తూ సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్ధికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా కలెక్టర్ శుక్రవారం రామలింగేశ్వనగర్‌లో ఇంటింటిని సందర్శించి ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అవ్వాతాతలకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు పెన్షన్ పెంచినట్లు తెలిపారు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ద్వారా రూ.5లకే భోజనం పెడుతున్నట్లు తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను చెల్లించంటం జరిగిందని, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌ను రద్దు చేయటంతో పాటు మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించాలన్న నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో సంక్షేమం, అభివృద్ది ద్వేయంగా ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేయనుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. (Story : ప్రజల ఆకాంక్షలకు ఆనుగుణంగా సేవలు)