సారధీ.. నీఆటలు.. సాగవు..!
టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పలగాని దుర్గారావు
శ్రీనివాస్ (న్యూస్ తెలుగు-చాట్రాయి):
సారధీ.. నీ ఆటలు నూజివీడులో సాగవని తెలుగు దేశం పార్టీ చాట్రాయి మండల ప్రధాన కార్యదర్శి పలగాని దుర్గారావు హెచ్చరించారు. సోమవారం ఉదయం తన నివాసంలో ఆయన న్యూస్ తెలుగుతో మాట్లాడుతూ. గడచిన సంవత్సరాలనుండి తెలుగుదేశం పార్టీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జిగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పార్టీ అభివృద్ధికి రేయనక పగలనకా కష్టపడుతున్నారని రెండుసార్లు ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ మొక్కవోని దీక్షతో పనిచేస్తున్నారని కొనియాడారు. వైసిపి పెనమలూరు ఎంఎల్ఏ కొలుసుపార్దసారధి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడు వచ్చి కనీసమైన పద్ధతి లేకుండా బీసీ కోటాలో.. బీసీ నాయకుడైన ముద్దరబోయినకు ద్రోహం చేయడానికి రావడం సిగ్గుచేటు అన్నారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకి సీటు ఇవ్వకపోతే పార్టీ చేదు అనుభవం రుచి చూడక తప్పదు అన్నారు. సారధి ఆటలు నూజివీడులో సాగవు అన్నారు. ఎన్నికలు జరగకుండానే గెలవకుండానే ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన రావడం నియోజకవర్గంలో అగ్నికి ఆజ్యం పోసినట్లు అయిందన్నారు. (Story: సారధీ.. నీఆటలు.. సాగవు..!)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!