UA-35385725-1 UA-35385725-1

పైసా పట్టు.. ఐపీ పెట్టు!

పైసా పట్టు.. ఐపీ పెట్టు!

చట్టంలో లొసుగులు.. రెచ్చిపోతున్న ఆర్ధిక నేరగాళ్లు

అప్పిచ్చిన వాడికి కుచ్చుటోపీ పెట్టి దర్జాగా తిరుగుతున్న కేటుగాళ్ళు

తిరువూరు (న్యూస్‌తెలుగు): పట్టణంలో రోజు రోజుకి ఆర్ధిక నేరగాళ్లు పెరిగి పోతుండటం ఆందోళన కలిగిస్తుంది. పైసా పట్టు-ఐపీ పెట్టు అనేలా చట్టం లోని లొసుగులను ఆసరా గా చేసుకుని అయిన కాడికి అప్పులు చేసి సొమ్మిచ్చిన వాడికి ఐపీపెడుతున్న‌కేటుగాళ్ళు విజృంభిస్తున్నారు. తమను ఎవ్వరూ ఏమి చేయలేరు అన్నట్లు పట్టణంలో దర్జాగా సంచరిస్తూ ఉండటం తిరువూరు ప్రాంతం లో సర్వ సాధారణం గా మారింది. పట్టణంలోని జంట సినిమా హాల్స్ సెంటర్ లో కొన్నేళ్ల పాటు ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించిన ఓ ప్రబుద్ధుడు నమ్మకం గా పదుల మంది సన్నిహితులు, స్నేహితుల నుండి మూడు నుండి అయిదు రూపాయలు మేర వడ్డీకి సుమారు 60లక్షలు సొమ్ములు పోగేసుకుని కొంతకాలం వడ్డీ డబ్బులు చెల్లించి ఇటీవల ఐపీ (శుభలేఖ)నోటీసులు పంపించి పలాయనం చిత్తగించాడు. నమ్మకం పెట్టుబడిగా, మాటల గారడీ తో కొన్నేళ్ల పాటు వ్యాపార లావాదేవీలు సక్రమంగా నిర్వహించి సమాజం లో మంచి వారిలా నటిస్తూ చేతికి అందిన చోటల్లా అప్పులు చేసి వ్యాపారంలో నష్టాలు పేరుతో అప్పిచ్చిన వారికి పంగ నామాలు పెట్టడం నేటి సమాజంలో విలువలు పతనావవస్థను తెలియ చేస్తుంది. అధిక వడ్డీ ఆశతో కొందరు, కష్టపడి కూడబెట్టిన సొమ్మును న్యాయ మైన వడ్డీకి ఇచ్చిన సామాన్యులు మరి కొందరు ఈ ఐపి రాబంధులు చేతిలో చిక్కుకుని లబోదిబో మంటున్నారు. పట్టణంలో పదుల సంఖ్యలో వున్న ప్రింటింగ్ ప్రెస్ యజమాని బాధితులు సొమ్ము పోయి శని పట్టినట్లు ఐపీ నోటీసులు అందుకుని ఏం చేయాలో అర్ధంగాక దిక్కు తోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో గత పదేళ్లలో ప‌లువురు ఐపీ రాయుళ్ళు 50లక్షలు నుండి 5కోట్లకు పైగా అప్పులు చేసి జనాలకు కుచ్చు టోపీ పెట్టి ఆ సొమ్ముతో స్థిర, చర ఆస్తులను బంధువుల పేరుతో కొనుగోలు చేస్తూ ఆపదలో ఆదుకున్న వారిని నట్టేట ముంచుతున్నారు. ఇదే కోవలో పలువురు వ్యాపారులతో పాటు ప్రైవేట్ చీటీ పాటల నిర్వాహకులు పెన్ను, పుస్తకం,నమ్మకం పెట్టుబడిగా వ్యాపారాలు నిర్వహించి చిట్ పాఠదారుల సొమ్ములు ఎగ్గొట్టి సంపాదించిన ఆస్తులు అయిన వారికి రాసి పెట్టి ఇప్పుడు దర్జాగా తిరుగుతుండటం బాధితులకు కట్టలు తెంచే ఆగ్రహం కలిగిస్తున్నా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కారణం ఏంటంటే అప్పులు తీసుకుని సొమ్ములు ఇవ్వకుండా ఐపీ నోటీసులు ఇచ్చిన వాడిపై భాధితులు వత్తిడి చేయటం నేరంగా చట్టం సూచించటం ఐపీ రాయుళ్లకు తిరుగు లేని అస్త్రం గా మారింది. ఈ కలియుగ సమాజం లో చట్టాలను చుట్టాలుగా చేసుకుని రెచ్చిపోతున్న ఆర్ధిక నేరగాళ్ళ కారణంగా దిగువ, మధ్య తరగతి ప్రజలకు అత్యవసర సమయాల్లో సైతం సొమ్ములు పుట్టని పరిస్థితులు దాపురిస్తున్నాయని పలువురు సమాజ సేవకులు ఆందోళన చెందుతున్నారు. అంతే గాకుండా ఈ అక్రమార్కులకు కొందరు రాజకీయ నేతలు, ఒకరిద్దరు నల్లకోటు న్యాయవాదులు తమ పరిధిలో అండగా వుండటం పట్టణంలో ఆర్ధిక నేరగాళ్లకు ఏ మాత్రం భయం లేకుండా పోయిందనేది సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఈ ఆర్ధిక నేరగాళ్ళ మాటల మాంత్రికుల విషయంలో జనం అప్రమత్తంగా ఉండటం తప్పించి హంగు, ఆర్భాటాలు చూసి అధిక వడ్డీలకు ఆశ పడితే బాధితులే అప్పుల కోసం రోడ్డున పడాల్సిన పరిస్థితి చూడాల్సి ఉంటుందనేది కాదనలేని వాస్తవం. (Story: పైసా పట్టు.. ఐపీ పెట్టు!)

See Also: 

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1