మొండిగేటు రైల్వే అండర్ డ్రైన్ కాలువ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి
ఎమ్మెల్యే నసీర్
న్యూస్తెలుగు/గుంటూరుః గుంటూరు తూర్పు నియోజకవర్గానికి అత్యవసరంగా ఉన్న మొండిగేటు రైల్వే అండర్ డ్రైన్ కాలువ వెడల్పు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాటనికి తగు చర్యలు తీసుకోవాలని గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ రామకృష్ణని కోరారు. శుక్రవారం గుంటూరు పట్టాభిపురంలోని డిఆర్ఎం ఆఫీసులో మర్యాదపూర్వకంగా డివిజనల్ రైల్వే మేనేజర్ రామకృష్ణని కలిశారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం లోని 70% ఏరియా డ్రైనేజీ మొత్తం ఈ మొండి గేటు రైల్వే అండర్ బ్రిడ్జి నుండి పారుదల అవుతుందన్నారు. ఈ రైల్వే అండర్ డ్రైన్ వెడల్పు లేకపోవడం వలన మురికి నీరు వెనుకకు తన్నుతున్నందువల్ల, రైల్వే ట్రాక్ మునిగిపోయి రైల్వే ట్రాక్ పాడయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు. వెంటనే ఈ బ్రిడ్జిని వెడల్పు చేసి నూతనంగా నిర్మించవలసిన అవసరం ఉందని, దీనికి అవసరమైన 9 కోట్ల రూపాయలను సగం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు, మిగిలిన సగం రైల్వే వారు నిధులు మంజూరు చేయాలన్నారు. రెండు డిపార్ట్మెంట్ లవారిని సమన్వయం చేసుకొని నిర్మాణం పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన డిఆర్ఎమ్ ప్రతిపాదనలు రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, సికింద్రాబాద్ కి పంపి, నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. (Story : మొండిగేటు రైల్వే అండర్ డ్రైన్ కాలువ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి )

