UA-35385725-1 UA-35385725-1

బీజేపీ ఆఫీసు ముట్ట‌డి!

అదానీ, అంబానీ లాంటి గ్యాంగ్ స్టర్ పెట్టుబడిదారుల నాయకుడు మోడీ
అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలి
– ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్

హైద‌రాబాద్: దేశ సంపదను కొల్లగొడుతున్న అదానీ, అంబానీ లాంటి గ్యాంగ్ స్టర్ పెట్టుబడిదారుల నాయకుడు మోడీ అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. అదానీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ప్రధాన మంత్రి మోడీ తన పదవిని దుర్వినియోగపరచి శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, నేపాల్, బాంగ్లాదేశ్ లాంటి దేశాలలో బొగ్గు, పోర్టులు, ఇంధనం, రవాణా,  విద్యుత్ ప్రాజెక్టులు అక్రమంగా ఇప్పించారని, అదానీ తో దోస్తీ దేశద్రోహం అని, ఇద్దరు కలసి దేశ సంపదను దోచుకొని అమ్ముకుంటున్నారని అయన దుమ్మెత్తిపోశారు. అదానీ కుంభకోణాలపై  జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దేశంలోని అన్ని బీజేపీ కార్యాలయాలను ముట్టడించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపుమేరకు,  హైదరాబాద్, నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ ను ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ముట్టడించింది. ఆప్ జండాలు, ప్లకార్డులు చేతబూని “మోదీ-అదానీ భాయ్ భాయ్”, “అదానీ చోర్ హాయితో మోడీ బడా చోర్”, ఎల్.ఐ.సి ను రక్షించండి, ఎస్.బి.ఐ ను రక్షించండి, దేశాన్ని రక్షించండి,  ప్రజల సొమ్ముకు రక్షణ కల్పించండి, మోడీ – అదానీ విశ్వాసఘాతకాలు ఆపండి అని ఆప్ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా, పోలీసులు అడ్డుకోగా ఆప్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పలువురు ఆప్ కార్యకర్తలు కిందపడిపోయారు. ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్ తోసహా అనేకమంది ఆప్ కార్యకర్తలను ఈడ్చుకుంట తీసుకెళ్లి అరెస్ట్ చేసి నగరంలోని పలు పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ  అదానీ గ్రూప్ షేర్లలో ఎల్ఐసి పెట్టుబడి విలువ రూ.77,000 కోట్ల నుంచి రూ.53,000 కోట్లకు పడిపోయిందని, ఫలితంగా ఎల్ఐసి రూ.23,500 కోట్ల నష్టం వాటిల్లిందని, ఎల్ఐసికి “పబ్లిక్ మనీ” ద్వారా సమకూరిన నిధులని ప్రధాని మోడీ కి తెలియదా అని, ఎలా అదానీ గ్రూప్ డొల్ల కంపెనీలలో పెట్టుబడులు పెట్టిస్తాడని, బాధ్యతా రాహిత్యం కదా, ఈ ప్రజా సొమ్ముకు ఎవరు భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. అదానీ ఎదుగుదల బీజేపీ పార్టీ నిధుల ఎదుగుదలకు దగ్గరి సంబంధం ఉందని, రెండు ఒకేసారి  జరుగుతున్నాయని, ఆ అక్రమ నిధులను బీజేపీ ఉపయోగించి ఎమ్యెల్యేలను, ఎంపీ లను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కోట్లాది మంది భారతీయులు తమ పొదుపులను ఎల్ఐసి, ఎస్.బి.ఐ మరియు పి.ఎన్.బి లలో దాచారని, ప్రజలకు తమ పొదుపు డబ్బును ఎవరు చెల్లిస్తారని, అదానియా, కేంద్ర ప్రభుత్వమా, మరి మోడీ మౌనం ఎందుకు వహిస్తున్నారని అయన ప్రశ్నించారు. అదానీ గ్రూప్ లలో ఎల్ఐసి మరియు ఎస్.బి.ఐ ల పెట్టుబడి ఆర్థిక వ్యవస్థను ప్రమాదానికి గురి చేసిందని, ఇది దేశ ప్రజానీకానికి తీవ్ర నష్టమని తక్షణమే ప్రధాని మోడీ మౌనం విడి  అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణతో విచారణ జరపాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రాములు గౌడ్, శోభన్ భూక్యా, నేతలు డా. హరి చరణ్, ఆఫస, టి. రాకేష్ సింగ్, ఆఫ్జాల్, మజీద్ తదితరులు పాల్గొన్నారు. (Story: బీజేపీ ఆఫీసు ముట్ట‌డి!)

See Also :

హాల్‌టికెట్లు ఇవ్వకపోతే ఈ నంబరుకు ఫోన్‌ కొట్టండి!

బాబు, లోకేశ్‌ల‌పై కుర‌సాల తిట్ల‌పురాణం

జ‌గ‌న్ స‌ర్కారుకు ఇంత నిర్ల‌క్ష్య‌మా?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1