ఆ నలుగురికీ రాజ్యసభ సీట్లు
వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్
టీడీపీ సీఎం అభ్యర్థికి సీటిచ్చి ఆశ్చర్యపరిచిన ఏపీ సీఎం
అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఖరారైంది. వాటికి సంబంధించి ఇదివరకే నోటిఫికేషన్ విడుదలైంది. నాలుగు సీట్లకు ఖాళీలుండగా, నాలుగు సీట్లు అధికార వైసీపీకే దక్కనున్నాయి. ఆశావాహుల జాబితా ఎంతవున్నప్పటికీ, ఎన్ని లాబీయింగ్‌లు వున్నప్పటికీ, సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేసి నాలుగు సీట్లకు నలుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే విచిత్రంగా…టీడీపీ సీఎం అభ్యర్థికి రాజ్యసభ సీటిచ్చి బీసీలకు తాయిలం విసిరారు. వైసీపీ దక్కే నాలుగు రాజ్యసభ సీట్లలో ఎవర్ని రాజ్యసభలో కూర్చోబెట్టాలనే దానిపై పార్టీ సీనియర్లతో మంతనాలు జరిపి ఫైనల్ చేశారు. పార్టీ సీనియర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణలతో చర్చించిన మీదట తుది జాబితా ఖరారైంది. రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో చోటు చేసుకున్నవారిలో విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆర్.క్రిష్ణయ్య, నిరంజన్‌రెడ్డిలు వున్నారు. వీరిలో ఆర్.క్రిష్ణయ్య బీసీల నాయకుడు. గతంలో ఆయన తెలంగాణలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాకపోతే టీడీపీ తరపున గెలిచారు. ఆనాడు నారా చంద్రబాబునాయుడు ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాతి కాలంలో క్రిష్ణయ్య వైఎస్‌ఆర్‌సీపీతో సన్నిహితంగా వున్నారు. దీంతో రాష్ట్రంలో 51 శాతమున్న బీసీలను మరింత దగ్గరకు చేర్చుకునే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనూహ్యమైన రీతిలో ఆర్.క్రిష్ణయ్యకు రాజ్యసభ సీటిచ్చారు. ఇప్పటవరకు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి పదవి కాలం ముగియడంతో మరోసారి ఆయనను రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇది అందరూ మొదటి నుంచి ఊహిస్తూ వచ్చిందే.. ఆయనకు రెన్యువల్ తప్పక ఉంటుందని ముందుగానే భావించారు. సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాది, నిర్మాత నిరంజన్ రెడ్డికి అవకాశం ఇచ్చి జగన్ ఆశ్చర్యపరిచారు. మిగిలిన సీటు కోసం బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బీదమస్తాన్ రావుకు ఇచ్చి సీట్ల ప్రస్థానాన్ని ముగించారు. ఎంతమంది ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఆ నలుగురికీ సీట్లు దక్కాయి. (Story: ఆ నలుగురికీ రాజ్యసభ సీట్లు)
-
See Also:
మీకు పిల్లలున్నారా? అయితే ఈ సర్వే చూడండి!
లిపెడెమా ఓ వ్యాధి…అలసత్వం వద్దు!
దుమ్మురేపిన వరలక్ష్మి! వీడియో
అలెర్ట్: బీపీ క్యాపిటల్‌గా హైదరాబాద్!)
నాకు మొగుడు కావాలి : ప్లకార్డుతో ఓ యువతి ప్రదర్శనపార్క్లో బట్టలు లేకుండా సంచరిస్తూ పట్టుబడ్డారు!
అంగన్వాడీ వర్కర్లకు శుభవార్త!
తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న
9 Hours is the next offering on Hotstar Specials
Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk
Chaging Movie Trailer