UA-35385725-1 UA-35385725-1

దుమ్మురేపిన వ‌ర‌ల‌క్ష్మి! వీడియో

దుమ్మురేపిన వ‌ర‌ల‌క్ష్మి! వీడియో

టాలెంటెడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ‘చేజింగ్’.. టీజర్ విడుదల

Chaging: టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో.. ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘చేజింగ్’. కె. వీరకుమార్ కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పరిటాల రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ప్రముఖ దర్శకులు వి. సముద్ర, సూర్యకిరణ్.. నిర్మాత రామసత్యన్నారాయణ సంయుక్తంగా ఈ టీజర్‌ను విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్, సుప్రభ హోటల్ సిఎమ్‌డి గుండు ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘ఈ కార్యక్రమానికి ఇంత మంది హాజరవడం చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ సినిమాకి ఎంతమంది సహకారం ఉందో. ఖచ్చితంగా ‘చేజింగ్’ మంచి సినిమా. నిర్మాతలు గ్రాండ్‌గా ఈ సినిమాని నిర్మించారనేది టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమాని వెనకుండి నడిపించింది పరిటాల రాంబాబుగారు. ఆయనకి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి విషయం తెలుసు. ఈ సినిమా మంచి విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.

దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలకు, దర్శకత్వం వహించిన దర్శకుడికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పరిటాల రాంబాబు ఆధ్వర్యంలో ఈ చిత్రం బాగా వచ్చిందని విన్నాను. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్‌గారితో నేను కూడా పనిచేశాను. మంచి టాలెంటెడ్ పర్సన్. ఆమె నటించిన చిత్రాలన్నీ మంచి విజయం సాధిస్తున్నాయి. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించి, టీమ్‌కి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను..’’ అన్నారు.

నిర్మాత రామసత్యన్నారాయణ మాట్లాడుతూ.. ‘‘నిర్మాతలు కొత్తవారైనా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబుగారు మంచి అనుభవజ్ఞుడు. ఆయన ఆర్గనైజేషన్‌లో సినిమా రెడీ అవుతుంది కాబట్టి.. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఇండస్ట్రీ నుండి కూడా ఈ సినిమాకి మంచి సపోర్ట్ ఉంది. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుంది.. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు..’’ అని తెలిపారు.

దర్శకుడు సూర్యకిరణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాని నేను చూడటం జరిగింది. చాలా రిచ్‌గా తీశారు. విజువల్స్ చాలా బాగున్నాయి. పరిటాల రాంబాబుగారి గురించి చెప్పాలంటే.. వాళ్ల అబ్బాయి అండర్ 19 క్రికెట్‌లో ఉన్నారు. అతని కంటే కూడా రాంబాబు చాలా స్పీడ్‌గా ఉంటారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది..’’ అని అన్నారు.

చిత్ర నిర్మాతలు జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి మాట్లాడుతూ.. ‘‘ఇది మా కాంబినేషన్‌లో మొదటి సినిమా అయినా.. ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడలేదు. మరిన్ని సినిమాలు తెలుగు, తమిళ్‌లో తీయాలని అనుకుంటున్నాము. ఈ సినిమాని ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరిస్తారని కోరుతున్నాము..’’ అని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు కె. వీరకుమార్, నటులు రంగరాజు, అప్సర్ ఆజాద్.. దర్శకుడు నగేష్ నారదాసి వంటివారు మాట్లాడుతూ.. సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి
లిరిక్స్: చల్లా భాగ్యలక్ష్మీ, బండారు హనుమయ్య
మాటలు: డాక్టర్ రాజశేఖర్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పరిటాల రాంబాబు
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాతలు: జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి
కథ-దర్శకత్వం: కె. వీరకుమార్. (Story: దుమ్మురేపిన వ‌ర‌ల‌క్ష్మి! వీడియో)

See Also: 

నాకు మొగుడు కావాలి : ప్లకార్డుతో ఓ యువతి ప్రదర్శన

పార్క్‌లో బట్టలు లేకుండా సంచరిస్తూ పట్టుబడ్డారు!

మసీదులో శివలింగం

అంగన్‌వాడీ వర్కర్లకు శుభవార్త!

తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న

ఆ నటిని భర్తే చంపేశాడు?

9 Hours is the next offering on Hotstar Specials

Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1