UA-35385725-1 UA-35385725-1

లిపెడెమా ఓ వ్యాధి…అలసత్వం వద్దు!

లిపెడెమా ఓ వ్యాధి…అలసత్వం వద్దు!

హైదరాబాద్‌: లిపెడెమా అనేది ఒక విధమైన వైద్య పరిస్థితిగా చెప్పవచ్చు, దీనిని సాధారణంగాడాక్టర్‌ వి.కె. శ్రీనగేష్‌, కన్సల్టెంట్‌ ప్లాస్టిక్‌ & కాస్మెటిక్‌ సర్జన్‌, అపోలో హాస్పిటల్‌, జూబ్లీ హిల్స్‌. ఊబకాయం, సెల్యుల్కెట్‌ లేదా లింఫెడెమా అని తప్పుగా అర్దం చేసుకోవడం, తప్పుగా నిర్ధారణ చేయడం జరుగుతుంటుందని అపోలో హాస్పిటల్‌ కన్సల్టెంట్‌ ప్లాస్టిక్‌, కాస్మెటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వి.కె. శ్రీనగేష్‌ చెప్పారు. మహిళల్లో ప్రత్యేకించి కనిపించే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా 10-15% వరకు వ్యాధి ప్రాబల్యత ఉంది. ఇది సాధారణంగా వ్యాధి చరిత్రతో జన్యు సంబంధం ఉన్న కుటుంబాలలో చూడవచ్చు. యుక్తవయస్సు, గర్భాధారణ, నెలసరి కారణంగా వ్యాధి ప్రేరేపించబడుతున్నదని కనుగొనబడినందున దీనిపై హార్మోన్ల ప్రభావం ఉన్నట్లు కనిపిస్తున్నది. లిపెడెమా అనేది జీవనశైలికి చెందిన వ్యాధి, దీనిని నియంత్రించవచ్చునని తెలిపారు. లిపెడెమాకు ప్లాస్టిక్‌ సర్జన్‌, వాస్కులర్‌ సర్జన్‌, ఫిజియోథెరపిస్ట్‌, సైకాలజిస్ట్‌, డైటీషియన్‌లతో కూడిన టీమ్‌ కలిసి అందించే చికిత్సతో మంచి ఫలితాలు రాబట్టవచ్చునన్నారు.

లిపెడెమాను మొదటిసారిగా జర్మనీలో 1940లో అలెన్‌ & హైన్స్‌లు గుర్తించారు, అయితే తెలియని కారణాల వలన డబ్ల్యుహెచ్‌ఒ అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణలో 2019 వరకు దీని గురించి పేర్కొనలేదు మరియు వైద్య కళాశాలల్లో దీని గురించి బోధించలేదు.

లిపెడెమాను ‘‘బాధాకరమైన కొవ్వు సిండ్రోమ్‌’’ అని కూడా అంటారు. నడుము సాధారణంగా సన్నగానే ఉంటుంది అయితే తుంటి, పిరుదులు, తొడలు, కాళ్లు మరియు కొన్నిసార్లు చేతుల్లో కూడా ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం దీని యొక్క లక్షణం. అయితే పాదాలు మరియు చేతులు మామూలుగానే ఉంటాయి బహుశా చీలమండ లేదా మణికట్టు కఫ్‌ కారణంగా అలా ఉండవచ్చు. లింఫాటిక్‌ (శోషరస) బలహీనత కారణంగా అవయవాల యొక్క వాపు మరియు భారం వంటివాటితో వ్యాధి పురోగతి చెందేకొద్ది స్పైడర్‌ వెయిన్స్‌ మరియు వెరికోస్‌ వెయిన్స్‌తో సంబంధం కలిగి ఉంటుంది. వ్యాధి కారణంగా తక్కువతో లేదా తెలియకుండా తగిలే గాయాలతో వారు సులభంగా గాయపడే ప్రమాదం ఉంటుంది. వ్యాధి పురోగమించే కొద్ది పరిస్థితి లిపిడెమా నుండి లిపోలింఫెడెమాకు అక్కడ నుండి ఫ్రాంక్‌ లింఫెడెమా వరకు కొనసాగుతుంది. ముందస్తుగా గుర్తించడం మరియు ముందుగానే చికిత్స అందించడం వలన వ్యాధి పురోగతిని ఆలస్యం చేయవచ్చు లేదా నెమ్మదింప చేయవచ్చు.

వ్యక్తి యొక్క ఆకృతి మరియు శరీరంలోని కొన్ని భాగాల అసాధారణ పెరుగుదల కారణంగా లిపెడెమా ఒక రకమైన స్థూలకాయం అని తప్పుగా అర్దం చేసుకుంటారు మరియు ‘‘పియర్‌ (బేరీ పండు) ఆకారపు ఊబకాయం’’గా ఇది వర్గీకరించబడిరది. దురదృష్టవశాత్తు రెగ్యులర్‌ డైటింగ్‌, వ్యాయామాలు లేదా బేరియాట్రిక్‌ సర్జరీ కూడా లిపెడెమా చికిత్స దీనిపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి.

సాధారణంగా దీనిని లింఫెడెమా అని తప్పుగా భావించి, కంప్రెషన్‌ బ్యాండేజ్‌లు మరియు కంప్రెషన్‌ మేజోళ్ళు వంటి వివిధ చికిత్సలతో దానిపై  ప్రయత్నిస్తారు కానీ ఆ చికిత్సలు తక్కువ లేదా అసలే ప్రయోజనం లేకుండా ఉంటాయి.

చర్మం హెచ్చు తగ్గులతో ముడత పడినట్లుగా ఉండడం మరియు పిరుదులు మరియు తొడల కొవ్వులో (నారింజ పై తొక్క వలె కనిపించడం) బియ్యం గింజలు ఆకారంలో లేదా నాడ్యులర్‌ అసమానతల కారణంగా లిపెడెమాను సెల్యులైట్‌ అని కూడా తప్పుగా భావించబడుతుంది. నొప్పి, భారం, నడకలో మార్పు, కీళ్లనొప్పులు, సులభంగా గాయాలయ్యే ప్రమాదం మరియు శరీర ఆకృతిలో స్థూల మార్పు కారణంగా కొంతమంది రోగులు చిరాకుకు మరియు నిరాశకు గురయ్యే పరిస్థితికి దారితీయవచ్చు.

లిపెడెమాలో 5 రకాలు మరియు 4 దశలు ఉన్నాయి మరియు ముందుగానే రోగనిర్ధారణ మరియు చికిత్స కనుక ప్రారంభించినట్లయితే, దీర్ఘకాల ఫలితంతో వారు సౌకర్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు. వ్యాధి యొక్క దశ మరియు వ్యాధి పురోగతి వేగాన్ని బట్టి, డికంప్రెసివ్‌ థెరపీ, మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా సర్జరీ వంటి చికిత్సల కలయికలను వ్యాధికి గురైన వ్యక్తికి అందించాలి, లింప్‌ స్పేరింగ్‌ వాటర్‌ అసిస్టెడ్‌ లిపోసక్షన్‌ మొదలుకుని స్పైడర్‌ వెయిన్స్‌కు లేదా వెరికోస్‌ వెయిన్స్‌ల నొప్పి నిర్వహణ మరియు స్టాసిస్‌ అల్సర్‌ల చికిత్సల వరకు వీటికి చికిత్సగా ఉంటుంది.

లిపెడెమాకు ప్లాస్టిక్‌ సర్జన్‌, వాస్కులర్‌ సర్జన్‌, ఫిజియోథెరపిస్ట్‌, సైకాలజిస్ట్‌ మరియు డైటీషియన్‌లతో కూడిన టీమ్‌ కలిసి అందించే చికిత్సతో మంచి ఫలితాలు రాబట్టవచ్చు.

డాక్టర్‌ శ్రీనగేష్‌ వాడ్రేవు జర్మనీలో శిక్షణ పొందిన అనుభవజ్ఞుడైన ప్లాస్టిక్‌ సర్జన్‌ మరియు రోగులకు అవగాహన మరియు చికిత్స అందిస్తున్నారు. భారతదేశంలో లిపిడెమాకు చికిత్స అందించడంలో అగ్రస్థానంలో ఉన్నారు మరియు ప్రపంచవ్యాప్తంగా లిపెడెమా వ్యాధి నిర్వహణలో పరిజ్ఞానం కలిగిన అతి కొద్దిమంది వైద్య నిపుణులలో ఆయన ఒకరు. (Story: లిపెడెమా ఓ వ్యాధి…అలసత్వం వద్దు!)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1