హైదరాబాద్‌లో మివి రూ.200 కోట్లతో తయారీ కేంద్రం ప్రారంభం
దేశంలో దశాబ్ద కాలంగా సాగుతున్న సంస్థ కార్యకలాపాలలో ఒక మైలురాయి
ఈ కేంద్రం మివి తయారీ కార్యకలాపాలకు మద్దతు.
దేశీయ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టి
న్యూస్ తెలుగు/హైదరాబాద్: దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలన్న మివి నిబద్ధతకు ఈ పెట్టుబడి ప్రతిబింబంగా నిలుస్తోంది. భారతదేశంలో తమ తయారీ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలకు తోడ్పడాలని సంస్థ భావిస్తోంది. దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ అభివృద్ధికి సహకరించడంతో పాటు భారతీయ వినియోగదారుల కోసం మరిన్ని ఉత్పత్తులను దేశంలోనే తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం.
గత పదేళ్ల కాలంలో ఆడియో బ్రాండ్ స్థాయి నుంచి వినియోగదారు ఎలక్ట్రానిక్స్ సంస్థగా మివి ఎదిగింది. తమ సొంత ఉత్పత్తులు, సాంకేతికతలను అభివృద్ధి చేసుకుంది. ఇటీవల మివి వన్ 5జీని విడుదల చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి కూడా కంపెనీ ప్రవేశించింది. 3డీ స్టేజ్, మివి ఏఐ వంటి కంపెనీ యొక్క సొంత సాంకేతికతలు సంస్థ ఉత్పత్తుల జాబితాలో ఉన్నాయి.
నెలకు 5 లక్షల ఇయర్‌బడ్స్, 75 వేల సౌండ్బార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం హైదరాబాద్ తయారీ కేంద్రానికి ఉంది. ఈ కేంద్రంలో సుమారు 2,500 మందికి ఉపాధి కల్పించడం ద్వారా స్థానిక ఉద్యోగావకాశాలకు మివి తోడ్పడుతోంది. అదే సమయంలో దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థకు అవసరమైన నైపుణ్యమున్న శ్రామిక శక్తిని బలోపేతం చేస్తోంది.
ఆడియో ఉత్పత్తులకు మించి స్మార్ట్ఫోన్లు, విస్తృత శ్రేణి ఎలక్ట్రానిక్స్ మార్కెట్లోకి విస్తరించడంపై సంస్థ తదుపరి దశ వృద్ధి ఆధారపడి ఉంటుంది. మరింత విస్తృతమైన సాంకేతిక ఉత్పత్తుల శ్రేణిని అభివృద్ధి చేసి అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీపడాలని మివి లక్ష్యంగా పెట్టుకుంది.
మివి సహ వ్యవస్థాపకురాలు మిధుల దేవభక్తుని మాట్లాడుతూ, “భారత్‌లో పదేళ్ల తయారీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ తయారీ కేంద్రం ప్రారంభించటం మాకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఇక్కడే ఉత్పత్తులు, సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని మొదటి నుంచీ మేము ప్రయత్నిస్తున్నాము. మేము మా తదుపరి దశ వృద్ధిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, సొంత సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడం, భారత్‌లో మా తయారీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం కొనసాగిస్తాము” అని అన్నారు.
మివి సహ వ్యవస్థాపకుడు విశ్వనాధ్ కందుల మాట్లాడుతూ, “గత పదేళ్లుగా, భారత్‌లో మివి ఉత్పత్తులు, సాంకేతికత, తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపైనే మేము దృష్టి సారించాము. హైదరాబాద్ తయారీ కేంద్రం ప్రారంభం మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్‌కు ఉన్న సామర్థ్యంపై మాకున్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. స్మార్ట్ఫోన్లు, ఇతర సాంకేతిక విభాగాల్లోకి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెట్టడం, భారతీయ వినియోగదారుల కోసం ఉత్పత్తులను అభివృద్ధి చేయడం కొనసాగిస్తాము” అని అన్నారు.
వ్యక్తిగత, గృహ ఆడియో ఉత్పత్తుల విభాగాల్లో గత పదేళ్లుగా మివి విస్తృత శ్రేణిలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్, నెక్‌బ్యాండ్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్లు, సౌండ్బార్లు వంటి ఉత్పత్తులను సంస్థ అందిస్తోంది. హైదరాబాద్‌లోని తయారీ కార్యకలాపాలతో సహా దేశీయంగా ఉత్పత్తుల అభివృద్ధి, పరిశోధన & అభివృద్ధి (ఆర్ & డీ), తయారీ రంగాల్లో సంస్థ గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. (Story: హైదరాబాద్‌లో మివి రూ.200 కోట్లతో తయారీ కేంద్రం ప్రారంభం)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!
