Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన కేంద్ర బృందం

దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన కేంద్ర బృందం

0

దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన కేంద్ర బృందం

పంట నష్టం,రైతు పెట్టుబడి, ఆశించిన దిగుబడి, ఆర్థిక నష్టాలపై రైతుతో నేరుగా చర్చ

న్యూస్ తెలుగు/కాకినాడ: కాకినాడ జిల్లాలో అరటి పంటకు జరిగిననష్టాలను అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT – Team-I) ఆదివారం పిఠాపురం మండలం వీరవాడ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించింది.
ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి, బాధిత రైతులతో కేంద్ర బృందం సభ్యులు నేరుగా మాట్లాడి పంట నష్టాల వివరాలను తెలుసుకున్నారు.
ఈ పరిశీలనలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు .
2026 జనవరి 20వ తేదీన 3.50 ఎకరాల విస్తీర్ణంలో కర్పూరం, చెక్కకేళి రకాల అరటి పంటను సాగు చేసినట్లు, తుఫాన్ సంభవించే సమయానికి పంట 9 నుంచి 11 నెలల వయస్సుకు చేరుకుని కోతకు సిద్ధంగా ఉందని,ఒక ఎకరానికి సుమారు 500 నుంచి 600 మొక్కలు నాటగా, సాధారణ పరిస్థితుల్లో సుమారు 500 గెలలు దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు,
ఒక్కో అరటి గెలకు మార్కెట్ పరిస్థితులను బట్టి రూ.250 నుంచి రూ.300 వరకు ధర లభిస్తుందని, ఈ లెక్కన ఒక ఎకరానికి సుమారు రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు స్థూల ఆదాయం వచ్చే అవకాశం ఉండేదని, నవంబర్, డిసెంబర్ నెలల్లో, ముఖ్యంగా కార్తీక మాసంలో అరటికి మంచి ధర లభిస్తుందని ఆశించినట్లు
అయితే తుఫాన్ సమయంలో వీచిన తీవ్ర గాలుల కారణంగా అరటి మొక్కలు పెద్ద సంఖ్యలో నేలకొరిగాయని, కొన్ని మొక్కలు విరిగిపోయి మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయని జిల్లా ఉద్యాన శాఖ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.

క్షేత్రస్థాయి పరిశీలనలో 50 శాతానికి పైగా పంట నష్టం జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు.
అరటి తోట సాగు కోసం ఇప్పటివరకు సుమారు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు అధికారులు వివరించారు. మొక్కల కొనుగోలు, ఎరువులు, కూలీల ఖర్చులు, అంతర సేద్య పనులు, ఇతర యాజమాన్య ఖర్చుల వివరాలను కేంద్ర బృందానికి తెలియజేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ,అర్హత కలిగిన పంట నష్టపోయిన అరటి రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెక్టారుకు రూ.35,000 చొప్పున పంటనష్టపరిహారం అందించనున్నట్లు వివరించారు.
ప్రభుత్వం అందించే పరిహారం తిరిగి పంట సాగు చేపట్టేందుకుఉపయోగపడుతుందని రైతులు తెలిపారు.
నేలకొరిగిన మొక్కలను తొలగించడం, కొత్త మొక్కలను నాటడం, వాటికి ఆధారాలు ఏర్పాటు చేయడం,ఎరువులు కొనుగోలు చేయడం, కూలీల ఖర్చులు భరించడం వంటి పనులకు పరిహారం కొంతమేర తోడ్పడుతుందని తెలిపారు
కేంద్ర బృందం సభ్యులు క్షేత్ర స్థాయిలో పంట నష్టం తీవ్రత ను పరిశీలించి, రైతు పెట్టుబడి, ఆశించిన దిగుబడి, మార్కెట్ ధరలు, పంట నష్టం కారణంగా ఎదురైన ఆర్థిక నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పరిశీలనలో గుర్తించిన అంశాలను తమ నివేదికలో పొందుపరిచి ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.
కోతకు సిద్ధంగా ఉన్న దశలో తుఫాన్ కారణంగా అరటి పంట దెబ్బతినడంతో రైతు ఆశించిన ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. (Story: దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన కేంద్ర బృందం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version