కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సప్ ఖాతా.. లక్షలు కొట్టేసిన సైబర్ చోరుడు
Cyber Crime: జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా క్రియేట్ చేసి, దాని ద్వారా 2.40 లక్షల రూపాయల కొట్టేసిన ఓ సైబర్ నేరగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏకంగా కలెక్టర్ పేరుపైనే నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించిన ఓ సైబర్ నేరగాడు… రూ. 2.40లక్షలు నగదు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. విషయం తెలుసుకున్న వ్యక్తి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇదంతా సైబర్ నేరగాళ్ల పనేనని తేలింది. నారాయణపేట కలెక్టర్ హరిచందన పేరు, ఆమె ఫొటోతో సైబర్ నేరగాడు నకిలీ వాట్సప్ ఖాతాను సృష్టించాడు. ఈ వాట్సప్ ఖాతా నుండి పలువురి అధికారులకు, ప్రముఖులకు.. తాను సమావేశంలో ఉన్నానని, ఒక వస్తువు వెంటనే కొనుగోలు చేసేందుకు నగదు కావాలంటూ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశాడు. ఈ మెస్సేజ్ చూసిన జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మూడు విడతలుగా రూ. 2.40 లక్షలు ఆమె ఖాతాకు బదిలీ చేశాడు. కొద్దిసేపటికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాట్సాప్‌లో మెసేజ్ ఇచ్చింది కలెక్టర్ కాదని, సైబర్ నేరగాడు అని పోలీసులు తేల్చారు. సదరు వ్యక్తి రaార్ఖండ్‌కు చెందిన నేరగాడిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్‌పీఆర్‌పీ పోర్టల్ ద్వారా నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేసి విచారిస్తామని తెలిపారు. విత్తనాల వ్యాపారం పేరుతో రూ.34 లక్షల మోసం చేసిన ఘటన కూడా ఈ మధ్యనే జరిగింది. కేవైసీ పేరుతో ఘరానా మోసం చేసిన కొందరు సైబర్ నేరగాళ్లు రూ.15లక్షలు మాయం చేసిన ఉదంతం తెల్సిందే. (Story: కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సప్ ఖాతా.. లక్షలు కొట్టేసిన సైబర్ చోరుడు)
See Also:
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్ చేసుకునే విధానం!
కేసీఆర్ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
తూచ్! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్ లేఖ!
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్