తెలగ సామాజికవర్గ పాదయాత్రకు విశేష స్పందన
విజయనగరం (న్యూస్ తెలుగు) : తెలగ సామాజిక వర్గ ఉత్తరాంధ్ర పాదయాత్రకు విజయనగరంలో విశేష స్పందన లభించింది. మంగళవారం ఉదయం పాదయాత్ర నగర శివారు దాసన్నపేట ప్రాంతానికి చేరుకోవడంతో సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు అధిక సంఖ్యలో వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ పాదయాత్ర నిర్వహిస్తున్న పల్లంట్ల వెంకట రామారావు (పి.వి.ఆర్.ను) కోట కూడలి వద్ద గజమాలతో సత్కరించారు. కోలాటం, తప్పెట గుళ్ళు, కర్రసాము, పులి వేషాలు ఈ పాదయాత్రకు ముందు నడిచాయి. కోట కూడలి వద్ద పి.వి.ఆర్. మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన తెలగ కులస్తులను బి.సి. జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు కారణంగా తెలగ విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేత పూసపాటి అతిథి గజపతి రాజు ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. పి.వి.ఆర్.ను సత్కరించారు. అనంతరం పాదయాత్ర మూడులాంతర్లు, గంటస్తంభం, కన్యకా పరమేశ్వరి కోవెల జంక్షన్, రైల్వే స్టేషన్, వీటి అగ్రహారం, వై జంక్షన్ మీదుగా చిన్నాపురం చేరుకుంది. ఈ పాదయాత్ర లో డాక్టర్ ఆర్.అప్పారావు, పెద్ది లక్ష్మీనారాయణ, కోలా నారాయణ అప్పారావు, పుప్పాల అప్పలరాజు, మాత గాయత్రి, మాతా బుజ్జి, చిక్కాల శశిభూషణరావు, సుంకర సూర్యనారాయణలతో పాటు వందలాది మంది తెలగ సామాజిక వర్గ సభ్యులు పాల్గొన్నారు. (Story: తెలగ సామాజికవర్గ పాదయాత్రకు విశేష స్పందన)
See Also:
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2