UA-35385725-1 UA-35385725-1

‘రాధే శ్యామ్’ నెరేటర్‌గా రాజమౌళి

‘రాధే శ్యామ్’ నెరేటర్‌గా రాజమౌళి

రెబల్ స్టార్ ప్రభాస్ ఎపిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ సినిమాకు నెరేటర్‌గా పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి..

‘రాధే శ్యామ్’(RAdhe Shyam) నెరేటర్‌గా రాజమౌళి(SS Rajamouli): రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌కు తోడు కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్‌తో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఈ సినిమా కోసం మేకర్స్ చాలా కష్టపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా రాధే శ్యామ్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు నెరేటర్‌గా మారిపోయారు పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి. రాధే శ్యామ్ సినిమాకు ఈయన వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. తెలుగులో జక్కన్న వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈయన వాయిస్ సినిమాకు ప్లస్ కానుందంటున్నారు మేకర్స్. అలాగే కన్నడలో శివరాజ్ కుమార్.. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్.. తమిళంలో సత్యరాజ్ రాధే శ్యామ్ సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించనున్నారు. హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.
ఈ సూపర్ స్టార్స్ అందరి వాయిస్.. ఆయా భాషల్లో సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిగ్గెస్ట్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇండియా, ఓవర్సీస్‌లో అత్యంత ఘనంగా ఈ సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యూవీ క్రియేష‌న్స్  ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. మార్చ్ 11, 2022న సినిమా విడుదల కానుంది. (Story: ‘రాధే శ్యామ్’ నెరేటర్‌గా రాజమౌళి)

నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..

టెక్నికల్ టీమ్:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె  రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌
డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్
సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
పిఆర్ఓ : ఏలూరు శ్రీను

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1