Home Blog Page 3

వినుకొండకు అదనపు కోర్టు: సీఎం, ఎమ్మెల్యే కు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు….

0

వినుకొండకు అదనపు కోర్టు: సీఎం, ఎమ్మెల్యే కు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు….

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండలో అదనపు కోర్టు మంజూరుకు విశేషంగా కృషి చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్, ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులుకు వినుకొండ బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రత్యేక చొరవ తీసుకుని సీఎంను కలవడం ద్వారానే ఈ కోర్టును త్వరితగతిన సాధించామన్నారు. కోర్టు మంజూరుకు సహకరించిన హైకోర్టు, జిల్లా, స్థానిక న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి.వి. రమణారెడ్డి, జాయింట్ సెక్రటరీ నీలం శేఖర్ బాబు, ట్రెజరర్ వి. శివశంకర్ బాబు, ప్రస్తుత ప్రెసిడెంట్ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, ఏజీపీ ముప్పాళ్ల జ్ఞానేశ్వర్ రావుతో పాటు పొట్లూరి సైదారావు, యలవర్తి శ్రీనివాసరావు, షేక్ సిద్దయ్య తదితర సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.(Story : వినుకొండకు అదనపు కోర్టు: సీఎం, ఎమ్మెల్యే కు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు…. )

బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కు ఘన సత్కారం….

0

బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కు ఘన సత్కారం….

న్యూస్ తెలుగు/వినుకొండ  : స్థానిక బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ప్రెసిడెంట్‌గా గెలుపొందిన పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్‌ను వినుకొండ పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది షేక్ సిద్దయ్య మాట్లాడుతూ.. వినుకొండ బార్ అసోసియేషన్ చరిత్రలో తొలిసారిగా ఓ ముస్లిం మైనార్టీ అభ్యర్థి ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం సంతోషకరమన్నారు. నూతన ప్రెసిడెంట్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గౌస్ మొహిద్దీన్ అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని న్యాయవాదులు సౌదాగర్ అబ్దుల్ హాఫీజ్, జె.ఎస్.కే. నాగూర్, చెరుకుంపాలెం అస్మతుల్లా ఖాన్ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.(Story : బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కు ఘన సత్కారం…. )

120 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం

0

120 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం

న్యూస్ తెలుగు/వినుకొండ  : 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల అమ్మకాలు, వాడకంపై పూర్తి నిషేధం ఉన్నట్లు వినుకొండ మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా బుధవారం ఆయన ప్లాస్టిక్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శివరామ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులకు బదులుగా పర్యావరణహితమైన క్లాత్, జ్యూట్ బ్యాగులను వాడాలని సూచించారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణ నష్టంతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్లాస్టిక్ రహిత వినుకొండ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇందుకు వ్యాపారులు కూడా తమ పూర్తి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇస్మాయిల్, ఏఐఐఎల్ఎస్‌జీ, జిల్లా కోఆర్డినేటర్ శివపార్వతి, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, మున్సిపల్ సిబ్బంది మరియు ప్లాస్టిక్ వ్యాపారులు పాల్గొన్నారు.(Story : 120 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం )

లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ నిరసన

0

లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ నిరసన

న్యూస్ తెలుగు/వినుకొండ  : కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను రద్దు చేస్తూ ఏప్రిల్ 1 నుంచి కొత్తగా లేబర్ కోడ్లను అమలు చేయడాన్ని నిరసిస్తూ వినుకొండలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు కొప్పరపు మల్లికార్జున మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకు తొత్తుగా మారారని మండిపడ్డారు. బ్రిటీష్ కాలం నుంచి కార్మికులు ఎన్నో త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు అనుకూలమైన 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారని విమర్శించారు. జాతీయ కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరపకుండానే పార్లమెంట్‌లో ఏకపక్షంగా వీటిని ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోడ్ల వల్ల కార్మికులకు యూనియన్లు ఏర్పాటు చేసుకునే, యాజమాన్యాలతో బేరసారాలు ఆడే, కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేకుండా పోతుందన్నారు. గత ఫిబ్రవరి 12న సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో కోట్లాది మంది ఆందోళనలు చేపట్టినా ఖాతరు చేయకుండా.. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లను అమలు చేయాలని నియంతృత్వంగా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఈ లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాయబారం వందనం, రాచపూడి ఏసుపాదం, సంపెంగల అబ్రహం రాజు, పచ్చిగొర్ల యేసు, కంచర్ల కోటేశ్వరరావు, సాయి తదితర కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.(Story : లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ నిరసన )

సౌత్ జోన్ బాల్ బాడ్మింటన్ పోటీల్లో సమీరాకు రజతం

0

సౌత్ జోన్ బాల్ బాడ్మింటన్ పోటీల్లో సమీరాకు రజతం

న్యూస్ తెలుగు/వినుకొండ  : తమిళనాడులోని తెన్కాసిలో జరిగిన 44వ సీనియర్ సౌత్ జోన్ బాల్ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడిన ఆకుమల్ల సమీరా రజత పతకం సాధించింది. శానంపూడి గ్రామానికి చెందిన ఈమె.. వినుకొండలోని రాధా డిగ్రీ కళాశాలలో చదువుతూ, స్థానిక బీసీ హాస్టల్‌లో ఉంటూ క్రీడల్లో రాణిస్తోంది. సమీరా అద్భుత ప్రదర్శన పట్ల జిల్లా బీసీ సంక్షేమ అధికారి కె.శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ షేక్ షకీలా దస్తగిరి, తదితర అధికారులు మరియు క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆమె మరింత ఎదిగేందుకు అవసరమైన ఆర్థిక మరియు ఇతర సహాయ సహకారాలు అందిస్తామని వారు అన్నారు.(Story : సౌత్ జోన్ బాల్ బాడ్మింటన్ పోటీల్లో సమీరాకు రజతం )

 రాష్ట్రవ్యాప్తంగా పండుగలా పెన్షన్ల పంపిణీ: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం…. మక్కెన..

0

 రాష్ట్రవ్యాప్తంగా పండుగలా పెన్షన్ల పంపిణీ: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం…. మక్కెన..

ఒక్కరోజే రూ. 2,700 కోట్ల పంపిణీ…..

​  నియోజకవర్గంలో రూ. 17.84 కోట్లు, మున్సిపాలిటీలో రూ. 2.34 కోట్లు అందజేసిన వైనం…..

న్యూస్ తెలుగు/వినుకొండ  : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. పేదల సంక్షేమమే లక్ష్యంగా, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని జిడిసిసిబి చైర్మన్, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లిఖార్జునరావు కొనియాడారు. పట్టణంలో పలు వార్డుల్లో మక్కెన చేతుల మీదగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 లక్షల మంది లబ్ధిదారులకు ఈ ఒక్క రోజే సుమారు రూ. 2,700 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేసింది. సాధారణ పెన్షన్‌ను రూ. 3,000 నుంచి రూ. 4,000 లకు, అలాగే వికలాంగుల పెన్షన్‌ను రూ. 3,000 నుంచి ఏకంగా రూ. 6,000 లకు పెంచి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా 40,330 మంది లబ్ధిదారులకు రూ. 17 కోట్ల 84 లక్షల రూపాయలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అలాగే కేవలం మున్సిపాలిటీ పరిధిలోనే 5,268 మందికి రూ. 2 కోట్ల 34 లక్షల రూపాయలను అందజేశారు. సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని వక్తలు గుర్తుచేశారు. ఒక పక్క రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తూనే.. మరోపక్క ‘సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు, కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా తలా రూ. 15,000 చొప్పున సాయం అందించే కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకి నాయకులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. శివరామ ప్రసాద్, మాజీ చైర్మన్, పార్టీ క్లస్టర్ ఇంచార్జి పూర్ణ, పట్టణ పార్టీ అధ్యక్షులు రోశయ్య, స్థానిక నాయకులు దాసయ్య, జానీ, తదితర కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(Story :  రాష్ట్రవ్యాప్తంగా పండుగలా పెన్షన్ల పంపిణీ: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం…. మక్కెన.. )

పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

0

పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్మని నిరుపేదలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేడు గడపగడపకు సంక్షేమ ఫలాలు అందేలా చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన, CMRF, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇప్పటివరకు 15 విడతలలో చెక్కుల పంపిణీ చేపట్టామన్నారు. ఇందుకుగాను ఇప్పటివరకు 15 విడతల్లో 6883 మంది CMRF లబ్ధిదారులకు రూ. 163030600 కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి 15 విడతలలో 4860 మంది లబ్ధిదారులకు రూ. 486563760 కోట్ల రూపాయలను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రులలో మెరుగైన చికిత్స అందించడం కోసం నేటి వరకు 339 మంది బాధితులకు రూ. 64715000 కోట్ల రూపాయలను ఆపత్కాలంలో మెరుగైన వైద్యం కోసం అందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మొత్తం 12082 మందికి గాను రూ. 714309360 చెక్కులను లబ్ధిదారులకు నేరుగా అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు వనపర్తి నియోజకవర్గ పరిధిలోనే మహిళా సంఘాలకు రూ. 359 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 1 కోటి 17 లక్షల కుటుంబాలకు 5 లక్షల బీమా వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల మందికి కొత్త పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయిలోనూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఎమ్మెల్యే అన్నారు. పని ఒత్తిడిలో పడి తల్లిదండ్రులను చూసుకోలేని ఉద్యోగస్తుల జీతంలోనుంచి 10 నుంచి 15 వేల రూపాయలను తల్లిదండ్రులకు అందజేసే విధంగా చట్టం చేసిందని, దీని ద్వారా కన్న తల్లిదండ్రులను జన్మనిచ్చిన గ్రామాన్ని ప్రతి ఒక్కరు ఎప్పటికీ గుర్తు గుర్తుపెట్టుకుంటారన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఉచిత కరెంటు, రైతు భరోసా, రైతులు పండించిన సన్న వడ్లకు బోనస్, రుణమాఫీ, రైతులకు రాయితీపై పనిముట్లు, ఇలాంటి అనేక పథకాలు చేపట్టి నిరుపేదలకు ఎంతో చేయూతని అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు . సొంత చెల్లినే సరిగా చూసుకోలేని నాయకులు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన శ్రీశైలం,నాగార్జునసాగర్, కోయిల్ సాగర్ , జూరాల నెట్టెంపాడు, లాంటి అనేక రిజర్వాయర్ల ద్వారా నేడు ఆయకట్టుకు సాగునీరు అందుతుందని మేమే నీళ్లు తెచ్చామని చెప్పే నాయకులు వనపర్తి నియోజకవర్గానికి నీళ్లు అందించిన ఒక్క ప్రాజెక్టును ఎక్కడ నిర్మించారో చూపించాలని ఆయన ప్రశ్నించారు.మేఘన ఆభయాసం పేరున మృతి చెందిన కుటుంబాలకు 5000 ఆర్థిక సహాయం అందజేస్తుంటే చూడలేని కొందరు దద్దమ్మలు దానిని కూడా రాజకీయం చేయడం సిగ్గుమాలిన తనమని ఆయన అన్నారు.మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించి ధ్వంసం చేశారని నేడు రాష్ట్రాన్ని చక్కదిద్దడంలో 18 గంటలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రమిస్తున్నారన్నారు. గతంలోని కొందరు నాయకులు పక్క వాళ్ళు చేసిన పనులకు రంగులేసి తామేదో ఉద్ధరించినట్లు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ వనపర్తి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, పట్టణ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం )

లేబర్ కోడ్ లపై ప్రతీఘటిస్తున్న కార్మిక వర్గం.. మొండి వైఖరితో అమలు చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం

0

లేబర్ కోడ్ లపై ప్రతీఘటిస్తున్న కార్మిక వర్గం.. మొండి వైఖరితో అమలు చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం

న్యూస్ తెలుగు/వనపర్తి :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోర్లను తక్షణమే రద్దు చేయాలని CITU. AITUC. TUCI.కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి లోని తోపుడు బండ్ల కార్మికులతో కలసి నిరసన తెలిపారు.. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి.మoడ్ల రాజు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోష. టియుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి గణేష్ లు మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడుదారులకు బడా కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ లను కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిందని. ఈ నాలుగు లేబర్ కోడ్ లు కార్మికుల మెడలకు ఉరి తాడులు గా వేలాడుతున్నాయని. కార్మికుల హక్కులను మొత్తం కాలరాస్తున్నాయని మండిపడ్డారు.. సంగం పెట్టే హక్కును. ఏడు మంది నుంచి 100 మంది పొడగించారని. ఉద్యోగ భద్రత గాలికి వదిలేశారని. పీఎఫ్ ఈఎస్ఐ. కనీస వేతనాలు. లాంటి సౌకర్యాలను యజమానులకు అనుకూలంగా మార్చారని.వారు విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ప్రైవేటు పరం చేసేందుకు ఈ నాలుగు లేబర్ కోట్లు ఉపయోగపడే విధంగా ఉన్నాయని. వాటిని ఆసరా చేసుకుని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ ఏకపక్ష నిర్ణయాలతో కార్మిక వర్గం అనేక సమస్యలు.సవాళ్ళతో కొట్టుమిట్టాడుతుందన్నారు. అందుకే కార్మిక వర్గం ప్రతిఘటిస్తూ మోడీ ప్రభుత్వం పై సమర శంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారని. సమ్మెల ద్వారా కార్మిక వర్గం ఇప్పటికే కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించిన మోడీ ప్రభుత్వం మాత్రం సమ్మె లను పెడ చెవిన పెడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేసి విద్యుత్ సవరణ బిల్లు 2022ను తక్షణమే ఉపసంహరించుకోవాలని. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కార్మికులకు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి.18 వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్. జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు నాయకులు మoడ్ల బాలస్వామి. తోపుడుబండ్ల కార్మిక సంఘం యూనియన్ అధ్యక్షులు నాగశేషి. ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ.ఏఐటీయూసీ జిల్లా నాయకులు రమేష్ వంశీ తోపుడుబండ్ల కార్మికులు సాయిలు.నాగన్న. తదితరులు పాల్గొన్నారు.(Story : లేబర్ కోడ్ లపై ప్రతీఘటిస్తున్న కార్మిక వర్గం.. మొండి వైఖరితో అమలు చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం )

పేమెంట్ కోసం పట్టు విడవని ‘పట్టు ‘కార్మికులు

0

పేమెంట్ కోసం పట్టు విడవని ‘పట్టు ‘కార్మికులు

కలెక్టర్, పిఓ ల హామీతో ధర్నా విరమణ

న్యూస్ తెలుగు/చింతూరు : పట్టు పరిశ్రమ వర్కర్స్ పెండింగ్ వేతనాలు చెల్లించాలని,పట్టు కాయలు పండించిన రైతులకు పెండింగ్ బకాయి సొమ్ము 1 కోటి 47 లక్షలు పైచిలుకు చెల్లించాలని చింతూరు ఐటిడిఏ వద్ద బుధవారం 7 గ్రామాల పట్టు పారిశ్రమ వర్కర్స్,రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా 3 సంవత్సరాల వేతన బకాయిలు,2 సంవత్సరాల రైతుల అమ్మినా పట్టుకయల సొమ్ము ఇవ్వాలని నినాదాలు ఇస్తున్నా సందర్భంగా ఐటిడిఏ పిఓ గ్రీవెన్స్ నుండి బయటకు వచ్చి పట్టు పరిశ్రమ కార్మికుల సమస్యలు విని మీ సమస్య త్వరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అయిన సరే ఎర్రని ఎండను లెక్కచేయకుండా ఇలాంటి మాటలు చాలా విన్నామని పట్టు కార్మికులు ధర్నా విరమించపోవడం తో పి ఓ చరవాణి లో కలెక్టర్ తో మాట్లాడి పట్టు పారిశ్రమ వర్కర్స్ రైతులు తో ఐ టి డి ఏ పి ఓ ప్రత్యేక సమయం కేటాయించి వారి సమస్య పరిష్కరిస్థానని పి ఓ హామీతో పట్టు పారిశ్రమ వర్కర్స్ రైతులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో కొక్కెరపాటి రవీంద్ర, 7 గ్రామాల పట్టు పారిశ్రమ కూలీలు,రైతులు పాల్గొన్నారు.(Story : పేమెంట్ కోసం పట్టు విడవని ‘పట్టు ‘కార్మికులు )

అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలోధర్నా

0

అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలోధర్నా

న్యూస్ తెలుగు/చింతూరు : అఖిల భారత రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఐ టీ డి ఎ ముందు ధర్నా నిర్వ హించారు. అనంతరం పిఒకు మెమొరాండం సమర్పించారు.గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని, అలాగే పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలని, 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఆ నిర్వాసితులకు నిర్మించిన కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వసతి కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కుంజా దూలయ్య మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పనుల ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి అయిందని, ముంపు గ్రామాల లక్షలాది కుటుంబాల్లో 12 వేల కుటుంబాలకు మాత్రమే కాగితాల్లో పునరావాసం కల్పించారని, అది కూడా సమగ్రంగా లేదని విమర్శించారు. పోలవరం నిర్వాసితులు పత్తిపాక, తుస్తివారి గూడెం, చిన్న మట్టపల్లి తదితర గ్రామాల ఆదివాసీలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చి పరిహారం చెల్లించాలన్నారు. అలాగే వీఆర్పురం, చింతూరు, ఎటపాక, కూనవరం మండలాల్లోని పోలవరం నిర్వాసితులకు కాలనీలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, పంచాయతీ కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే 500 మంది ఓటర్లు ఉంటే ఆదివాసి గ్రామాల్లో గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని జీవో నెంబర్ 63 ప్రకారం ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించి కాలనీలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే ముంపు మండలాల్లో తునికాకు సేకరణ ప్రభుత్వం చేసి ఆదివాసీలకు ఉపాధి కల్పించాలన్నారు. పెరిగే ధరలకు అనుగుణంగా తుని కాకు కట్ట రేటు పెంచాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఐవి రమణ, పల్లాల అశోక్, బాడిశ రామయ్య, గొర్రె సత్యనారాయణ, వంజం మూర్తి, పైదా శ్రీను తదితరులు పాల్గొన్నారు.(Story : అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలోధర్నా )

Photo Gallery

error: Content is protected !!