Home Blog Page 2

 నారాయణ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే….

0

 నారాయణ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే….

న్యూస్ తెలుగు/వినుకొండ  : పట్టణంలోని నారాయణ స్కూల్‌లో పీపీ-2 నుంచి 1వ తరగతికి, 5 నుంచి 6వ తరగతికి ప్రమోట్ అయిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డ్రెస్సుల్లో సందడి చేసిన చిన్నారులకు సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల కృషి, పట్టుదలకు ఇది గుర్తింపు అని అభినందించారు. ఇది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందిస్తూ వారి భవిష్యత్తుకు మంచి ఆరంభంగా నిలుస్తుందని ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జెడ్‌సీఓలు రిహాని, గౌసియా విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు అనురాధ, రాగసుధ, ఏవో శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.(Story :  నారాయణ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే…. )

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలి: బీఎస్పీ….

0

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలి: బీఎస్పీ….

న్యూస్ తెలుగు/వినుకొండ  : దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తించవన్న సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రాజు డిమాండ్ చేశారు. వినుకొండలోని ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఎస్పీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకివీడు దళితులపై అక్రమ కేసులు ఎత్తివేసి, ప్రభుత్వమే గొంతలమ్మ గుడి నిర్మించాలన్నారు. కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును పదవి నుంచి బర్తరఫ్ చేసి, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కంభంపాటి నాగవంశీ, పూనూరి జాన్సన్, వరప్రసాద్, శివప్రసాద్, వెంకటయ్య, రమేష్ బాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.(Story : దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలి: బీఎస్పీ…. )

డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామ అనర్హుడు: మాల మహానాడు..

0

డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామ అనర్హుడు: మాల మహానాడు..

న్యూస్ తెలుగు/వినుకొండ  : దళితులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆ పదవికి అనర్హుడని మాల మహానాడు వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆకివీడులో దళితులపై దాడులు చేయించి, బాధితులైన 57 మందిపైనే అక్రమ కేసులు పెట్టించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.రఘురామపై విద్వేష ప్రసంగాల కింద కేసు నమోదు చేసి, దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని, కూటమి పెద్దలు రఘురామను కట్టడి చేయకపోతే ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దళిత శక్తిని ఏకం చేసి పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు బేతం దేవానంద్, ఇజ్రాయిల్, కృపయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.(Story : డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామ అనర్హుడు: మాల మహానాడు..)

రాజప్రసాదం మరమ్మత్తులు ఎప్పుడు? ప్రభుత్వానికి సూటి ప్రశ్న…

0

రాజప్రసాదం మరమ్మత్తులు ఎప్పుడు? ప్రభుత్వానికి సూటి ప్రశ్న…

గత ప్రభుత్వంలో వచ్చిన 22 కోట్లు ఎప్పుడు ఖర్చు చేస్తారు

న్యూస్ తెలుగు/వనపర్తి : 2021 సంవత్సరం నుండి రాజప్రసాదం పాలిటెక్నిక్ భవనం కాపాడాలని అఖిలపక్ష ఐక్యవేదిక పోరాటం చేసి సాధించిన విజయంలో భాగంగా గత ప్రభుత్వంలో ఇరవై రెండు కోట్లు వచ్చాయి. కానీ 8 కోట్ల 90 లక్షలకు టెండర్ అయి ఉన్న సమయంలో ఎలక్షన్లు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చి అవి వెనక్కి పోయాయని మళ్లీ జీవో నెంబర్ మార్చి తెస్తానని చెప్పిన ఎమ్మెల్యే . కానీ రెండున్నర సంవత్సరాలు అయిపోయిన ఇంకా రాజప్రసాదం పనులు ప్రారంభం కాకపోవడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కి ఎమ్మెల్యే కి అఖిలపక్ష ఐక్యవేదిక విజ్ఞాపన చేస్తూ వెంటనే పనులు మొదలుపెట్టించాలని కోరారు. అదనంగా మరొక 20 కోట్లు తెప్పించాలని కోరుతున్నాము. దీంట్లో అఖిలపక్ష ఐక్యవేదిక చేసిన పోరాటాన్ని తక్కువ చేసి చూపడం సరికాదని, మేము చేసిన పోరాటం వల్లనే 22 కోట్లు వచ్చాయనింది ఈ ఫోటోల ద్వారా ప్రజలకు నాయకులకు గుర్తు చేస్తున్నాము..త్వరగా పనులు ప్రారంభం కాకపోతే అఖిలపక్ష ఎక్కువేదిక తరపున ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. డాక్టర్ సతీష్ యాదవ్ వెంకటేశ్వర్లు, కొత్తగొల్ల శంకర్, శ్రీనివాసులు, రామస్వామి, మైబూస్ తదితరులు పాల్గొన్నారు.(Story : రాజప్రసాదం మరమ్మత్తులు ఎప్పుడు? ప్రభుత్వానికి సూటి ప్రశ్న… )

నూతన వధూవరులను ఆశీర్వదించిన రావుల

0

నూతన వధూవరులను ఆశీర్వదించిన రావుల

న్యూస్ తెలుగు/వనపర్తి : హైదరాబాద్, మహబూబ్ నగర్ జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ కె.ఎస్. రవికుమార్ గారి కుమారుడు . సాయి తేజ కొట్టాల (సన్నీ) వివాహం శ్రావ్య తో ఈరోజు బి.ఎం.ఆర్. కన్వెన్షన్ సెంటర్, ఓ.ఆర్.ఆర్ ఎగ్జిట్ నెం.12 దగ్గర, ఎదురుగా మన్నెగూడ ఆర్టీవో కార్యాలయం, నాగార్జునసాగర్ రోడ్డు, హైదరాబాదులో వివాహం ఘనంగా జరిగింది ఇట్టి వివాహానికి మాజీ పార్లమెంట్ సభ్యులు , మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు, వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు, వారితోపాటు తెలంగాణ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉబేదుల్లా కోత్వాల్ , సీనియర్ న్యాయవాది నాగేశ్వర్ రెడ్డి , డాక్టర్ ఎ. భూపేష్ గారు, కొత్తకోట మండలం కానాయపల్లి మాజీ సర్పంచ్ పోతులపల్లి యాదయ్య సాగర్ తదితరులు ఈ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.(Story : నూతన వధూవరులను ఆశీర్వదించిన రావుల )

అభివృద్ధి ఫలాలను అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

0

అభివృద్ధి ఫలాలను అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి

న్యూస్ తెలుగు/వనపర్తి : అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చి అభివృద్ధి ఫలాలను అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ లో భాగంగా గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అందించిన సందేశాన్ని చదివి గ్రామ ప్రజలకు వినిపించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత రెండున్నర ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చదివి వినిపించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చి అభివృద్ధి ఫలాలను అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు సీఎం రేవంత్ నిర్ణయం మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లాలోని 268 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నానన్నారు. గ్రామంలో ప్రజలకు జరిగిన మంచిని తెలియజేయడమే కాకుండా, ఇంకా గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాల విషయాలని గ్రామసభ ముందు ఉంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళా శక్తి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పెన్షన్, ఉచిత చీరల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజల మన్ననలను అందుకుంటుందన్నారు. తన స్వగ్రామమైన జయన్న తిరుమలాపూర్ లో 98 మంది రైతులకు గాను మొత్తం రూ. 85.63 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 364 మంది రైతులకు గాను 846 ఎకరాలకు రూ. 50.82 లక్షలను పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను అందించడం జరిగిందన్నారు. గ్రామంలో మొత్తం 436 రేషన్ కార్డులు ఉండగా కొత్తగా 36 రేషన్ కార్డులను జారీ చేసినట్లు తెలియజేశారు. పేద ప్రజలు కరెంటు బిల్లు భారాన్ని మోయకుండా ఇబ్బందులను తొలగిస్తూ గృహ జ్యోతి పథకంతో 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించడం జరుగుతుందని తెలియజేశారు. గ్రామంలో 214 మంది లబ్ధిదారులు గృహజ్యోతి ఫలాలను పొందుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కృషి వల్ల ప్రస్తుతం చెరువులు కుంటలు నిండుగా నిండి భూగర్భ జలాలు పెరిగి బోర్లు రీఛార్జి అయినట్లు తెలిపారు. వీరికే కాకుండా రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. అర్హులైన వారు గ్రామసభలో తమకు కావాల్సిన సంక్షేమ పథకాలకు హెల్ప్ డెస్క్ వద్ద అర్జీలు పెట్టుకోవచ్చు అని సూచించారు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే జయన తిరుమలాపూర్ గ్రామంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, నిర్మాణం చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న పాఠశాలలు పదో తరగతి వరకు అప్డేట్ చేసి ఉన్నత పాఠశాల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించాలని చదివించడం ద్వారానే మంచి, అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. గ్రామంలో బెల్ట్ షాపులను లేకుండా చేసేందుకు మహిళలు అందరూ నడుం బిగించాలని సూచించారు. తిరుమలాపురం గ్రామానికి జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు లభించే విధంగా నూతన పాలకవర్గం పరిచేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఈ రెండున్నర ఏళ్లలో ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందించింది, ఏ విధమైన అభివృద్ధి చేసింది అనే విషయాలను ప్రజలకు వివరించడమే కాకుండా, ఇంకా ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలుసుకునేందుకే ఈ గ్రామసభలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, గృహ జ్యోతి, రేషన్ కార్డులు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులను ప్రజలకు వివరించారు. జిల్లా వ్యాప్తంగా రూ. 480 కోట్లతో రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా 1.75 లక్షల మంది రైతులకు రూ. 250 కోట్లతో రైతు భరోసా అందించడం జరిగిందన్నారు. తిరుమలాపూర్ గ్రామం విషయానికి వస్తే గ్రామంలో 12 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. మొత్తం 129 మంది రైతుల నుంచి 2025-26 ఖరీఫ్ పంట కొనుగోలు చేసి రూ. 1.55 లక్షలు రైతుల ఖాతాలో వేయడం జరిగిందన్నారు. 262 మంది మహిళలకు ఏకరూప చీరలను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. 24 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడు లక్షల రూపాయల వడ్డీలేని రుణాలు చేయడం జరిగిందన్నారు. వారికి గ్రామానికి కావాల్సిన తాగునీటి వసతి, సిసి రోడ్లు, డ్రైనేజీలు వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇంకా సంక్షేమ పథకాల లబ్ధి కావాల్సిన వారు గ్రామసభ హెల్ప్ డెస్క్ లో అర్జీ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, డివైస్ ఓ సుధీర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జ్యోతి గోపాల్, ఉప సర్పంచ్ రాజు, గ్రామ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.(Story : అభివృద్ధి ఫలాలను అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం )

ఇంటి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో వినుకొండ

0

ఇంటి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో వినుకొండ

95 శాతం లక్ష్యం పూర్తి.. సిబ్బందికి, ప్రజలకు మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు

న్యూస్ తెలుగు/వినుకొండ  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణ స్థానిక సంస్థల్లో ఇంటి పన్ను వసూళ్లలో వినుకొండ పురపాలక సంఘం ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని మొత్తం 126 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు గాను.. అత్యధికంగా 95 శాతం పన్ను వసూలు చేసి వినుకొండ మున్సిపాలిటీ ఈ ఘనత సాధించింది. మున్సిపాలిటీ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 6.58 కోట్ల పన్నుల డిమాండ్ ఉండగా, రికార్డు స్థాయిలో రూ. 6.25 కోట్లు (95%) వసూలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కోడూరు శివరామ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి విశేషంగా కృషి చేసిన రెవెన్యూ ఆఫీసర్ శ్రీ కె.వి. కోటేశ్వరరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. మణికంఠ, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో పాటు అవుట్ సోర్సింగ్ రెవెన్యూ సిబ్బందికి కమిషనర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే, పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీకి సహకరించిన వినుకొండ పట్టణ ప్రజలందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(Story : ఇంటి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో వినుకొండ )

వినుకొండకు అదనపు కోర్టు: సీఎం, ఎమ్మెల్యే కు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు….

0

వినుకొండకు అదనపు కోర్టు: సీఎం, ఎమ్మెల్యే కు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు….

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండలో అదనపు కోర్టు మంజూరుకు విశేషంగా కృషి చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్, ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులుకు వినుకొండ బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రత్యేక చొరవ తీసుకుని సీఎంను కలవడం ద్వారానే ఈ కోర్టును త్వరితగతిన సాధించామన్నారు. కోర్టు మంజూరుకు సహకరించిన హైకోర్టు, జిల్లా, స్థానిక న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి.వి. రమణారెడ్డి, జాయింట్ సెక్రటరీ నీలం శేఖర్ బాబు, ట్రెజరర్ వి. శివశంకర్ బాబు, ప్రస్తుత ప్రెసిడెంట్ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, ఏజీపీ ముప్పాళ్ల జ్ఞానేశ్వర్ రావుతో పాటు పొట్లూరి సైదారావు, యలవర్తి శ్రీనివాసరావు, షేక్ సిద్దయ్య తదితర సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.(Story : వినుకొండకు అదనపు కోర్టు: సీఎం, ఎమ్మెల్యే కు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు…. )

బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కు ఘన సత్కారం….

0

బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కు ఘన సత్కారం….

న్యూస్ తెలుగు/వినుకొండ  : స్థానిక బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ప్రెసిడెంట్‌గా గెలుపొందిన పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్‌ను వినుకొండ పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది షేక్ సిద్దయ్య మాట్లాడుతూ.. వినుకొండ బార్ అసోసియేషన్ చరిత్రలో తొలిసారిగా ఓ ముస్లిం మైనార్టీ అభ్యర్థి ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం సంతోషకరమన్నారు. నూతన ప్రెసిడెంట్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గౌస్ మొహిద్దీన్ అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని న్యాయవాదులు సౌదాగర్ అబ్దుల్ హాఫీజ్, జె.ఎస్.కే. నాగూర్, చెరుకుంపాలెం అస్మతుల్లా ఖాన్ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.(Story : బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కు ఘన సత్కారం…. )

120 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం

0

120 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం

న్యూస్ తెలుగు/వినుకొండ  : 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల అమ్మకాలు, వాడకంపై పూర్తి నిషేధం ఉన్నట్లు వినుకొండ మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా బుధవారం ఆయన ప్లాస్టిక్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శివరామ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులకు బదులుగా పర్యావరణహితమైన క్లాత్, జ్యూట్ బ్యాగులను వాడాలని సూచించారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణ నష్టంతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్లాస్టిక్ రహిత వినుకొండ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇందుకు వ్యాపారులు కూడా తమ పూర్తి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇస్మాయిల్, ఏఐఐఎల్ఎస్‌జీ, జిల్లా కోఆర్డినేటర్ శివపార్వతి, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, మున్సిపల్ సిబ్బంది మరియు ప్లాస్టిక్ వ్యాపారులు పాల్గొన్నారు.(Story : 120 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం )

Photo Gallery

error: Content is protected !!