Homeవార్తలుతెలంగాణపేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్మని నిరుపేదలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేడు గడపగడపకు సంక్షేమ ఫలాలు అందేలా చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన, CMRF, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇప్పటివరకు 15 విడతలలో చెక్కుల పంపిణీ చేపట్టామన్నారు. ఇందుకుగాను ఇప్పటివరకు 15 విడతల్లో 6883 మంది CMRF లబ్ధిదారులకు రూ. 163030600 కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి 15 విడతలలో 4860 మంది లబ్ధిదారులకు రూ. 486563760 కోట్ల రూపాయలను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రులలో మెరుగైన చికిత్స అందించడం కోసం నేటి వరకు 339 మంది బాధితులకు రూ. 64715000 కోట్ల రూపాయలను ఆపత్కాలంలో మెరుగైన వైద్యం కోసం అందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మొత్తం 12082 మందికి గాను రూ. 714309360 చెక్కులను లబ్ధిదారులకు నేరుగా అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు వనపర్తి నియోజకవర్గ పరిధిలోనే మహిళా సంఘాలకు రూ. 359 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 1 కోటి 17 లక్షల కుటుంబాలకు 5 లక్షల బీమా వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల మందికి కొత్త పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయిలోనూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఎమ్మెల్యే అన్నారు. పని ఒత్తిడిలో పడి తల్లిదండ్రులను చూసుకోలేని ఉద్యోగస్తుల జీతంలోనుంచి 10 నుంచి 15 వేల రూపాయలను తల్లిదండ్రులకు అందజేసే విధంగా చట్టం చేసిందని, దీని ద్వారా కన్న తల్లిదండ్రులను జన్మనిచ్చిన గ్రామాన్ని ప్రతి ఒక్కరు ఎప్పటికీ గుర్తు గుర్తుపెట్టుకుంటారన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఉచిత కరెంటు, రైతు భరోసా, రైతులు పండించిన సన్న వడ్లకు బోనస్, రుణమాఫీ, రైతులకు రాయితీపై పనిముట్లు, ఇలాంటి అనేక పథకాలు చేపట్టి నిరుపేదలకు ఎంతో చేయూతని అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు . సొంత చెల్లినే సరిగా చూసుకోలేని నాయకులు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన శ్రీశైలం,నాగార్జునసాగర్, కోయిల్ సాగర్ , జూరాల నెట్టెంపాడు, లాంటి అనేక రిజర్వాయర్ల ద్వారా నేడు ఆయకట్టుకు సాగునీరు అందుతుందని మేమే నీళ్లు తెచ్చామని చెప్పే నాయకులు వనపర్తి నియోజకవర్గానికి నీళ్లు అందించిన ఒక్క ప్రాజెక్టును ఎక్కడ నిర్మించారో చూపించాలని ఆయన ప్రశ్నించారు.మేఘన ఆభయాసం పేరున మృతి చెందిన కుటుంబాలకు 5000 ఆర్థిక సహాయం అందజేస్తుంటే చూడలేని కొందరు దద్దమ్మలు దానిని కూడా రాజకీయం చేయడం సిగ్గుమాలిన తనమని ఆయన అన్నారు.మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించి ధ్వంసం చేశారని నేడు రాష్ట్రాన్ని చక్కదిద్దడంలో 18 గంటలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రమిస్తున్నారన్నారు. గతంలోని కొందరు నాయకులు పక్క వాళ్ళు చేసిన పనులకు రంగులేసి తామేదో ఉద్ధరించినట్లు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ వనపర్తి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, పట్టణ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!