Home Blog Page 4

చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలి

0

చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి వి రజని.

న్యూస్ తెలుగు/వనపర్తి  : చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలి అని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి వి రజని అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో తాడిపర్తి లోని గాయత్రి బి.ఈ.డి కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి గారు పోక్సో మరియు NDPS చట్టం గురించి వివరించారు. ఈ చట్టాల గురించి కాబోయే ఉపాధ్యాయులుగా అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తు తరాలైన విద్యార్థులను సక్రమమైన మార్గంలో నడిపించడానికి మార్గం సులువు అవుతుందని అన్నారు. అదేవిధంగా బాల్యవివాహాల నిర్మూలన చట్టం మరియు వినియోగదారుల రక్షణ చట్టం గురించి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు , గాయత్రి బిఈడి కళాశాల అధ్యాపక బృందం మల్లికార్జున్, మోహన్, సురేష్, వీరభద్రయ్య, నిరంజన్ వలి, నాగేంద్రం మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.(Story : చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలి )

రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సు ల ముమ్మర తనిఖీ లు

0

రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సు ల ముమ్మర తనిఖీ లు

న్యూస్ తెలుగు/చింతూరు : రాష్ట్రంలో లో జరుగుతున్న బస్ లలో అగ్ని ప్రమాదాలు,ఆక్సిడెంట్ లు తరచూ జరుగుతున్నాయి.వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న బస్సుల స్పెషల్ డ్రైవ్ లో తనిఖీలో భాగంగా రవాణాశాఖ & పోలీస్ శాఖ, అగ్నిమాపక ల సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 3 శాఖల సిబ్బంది సమన్వయంతో బుధవారం తెల్లవారు జామున బస్ తనిఖీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బండారు చల్లారావు మాట్లాడుతూ రాష్టమంతటా బస్ ల స్పెషల్ డ్రైవ్ తనిఖీ జరుగుతుందని తెలిపారు . ఈ స్పెషల్ డ్రైవ్ తనిఖీ లో భాగంగా రవాణాశాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బస్ లు విస్తృతంగా తనిఖీ చేస్తున్న ట్లు తెలిపారు., ప్రతి బస్సులో ఎమర్జెన్సీ డోర్, ఎమర్జెన్సీ విండో, ఫైర్ ఎగ్జిఇష్టర్ తప్పనిసరిగా వుండాలని తనిఖీ చేసి , లేని బస్సులకు తగిన విధమైన చలానాలను విధించడం జరిగిందన్నారు .వాహన ప్రయాణం లో ప్రయాణికుల భద్రత చాలా ముఖ్యమని, ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించవలసిందిగా వాహన డ్రైవర్స్ ను హెచ్చరించడం జరిగిందన్నారు.(Story : రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సు ల ముమ్మర తనిఖీ లు )

కార్పొరేట్ల అనుకూల లేబర్ కోడ్ ల అమలుతో కార్మిక వర్గానికి చీకటి రోజులు

0

కార్పొరేట్ల అనుకూల లేబర్ కోడ్ ల అమలుతో కార్మిక వర్గానికి చీకటి రోజులు

కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలి

న్యూస్ తెలుగు/కర్నూలు : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులు కాలరాసి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో తెచ్చిన కార్పొరేట్లకు అనుకూలమైన 4 లేబర్ కోడ్ లను అమలు చేయనున్న 2026 ఏప్రిల్ 1 కార్మిక వర్గానికి బ్లాక్ డే* చీకటి రోజులు మొదలైనట్లేనని అందుకే కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని ఏఐటీయూసీ,సిఐటియు సంఘాలు డిమాండ్ చేశాయి.లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ బ్లాక్ డే పాటించాలన్న అఖిల భారత ట్రేడ్ యూనియన్ లు ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఏఐటీయూసీ,సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక కోట్ల సర్కిల్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి. రాజు, సిపిఎం మండల కార్యదర్శి గఫుర్ మాట్లాడుతూ నాలుగు లేబర్‌ కోడ్‌ల అమలు పేరుతో ఇప్పటి వరకు ఉన్న కార్మిక చట్టాల రక్షణ కవచాన్ని కార్మిక ద్రోహులు నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయనకు వంత పాడుతున్న నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు చిద్రం చేస్తున్నాయని ఎన్నో పోరాటాలు,ప్రాణ త్యాగాలతో కార్మిక వర్గం రక్తం చిందించి సాధించుకున్న హక్కులపై కార్పొరేట్లకు లాభాలను దోచిపెట్టడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్‌ కనుసన్నలలోని కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నదన్నారు.ఇది యూనియన్ల ఏర్పాటుకు అడ్డంకులు,సమ్మె హక్కుపై ఆంక్షలు,8 గంటల పని విధానాన్ని తుంగలో తొక్కడం పని గంటల పెంపు,శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు,గిగ్‌ పనులు,భద్రతా చర్యలకు తూట్లు పొడవడం తదితర చర్యలతో తెచ్చిన లేబర్‌ కోడ్ లు దేశ వ్యాప్తంగా కార్మికుల జీవితాలకు ప్రమాద ఘంటికలు మోగించబోతున్నాయి అన్నారు.కార్మిక వర్గం మనుగడ సాగించాలంటే లేబర్‌ కోడ్‌ల రద్దు తప్ప మరో మార్గం లేదని వారు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడినాడాలని లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని,పాత కార్మిక చట్టాలనే అమలు చేయాలని,విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని,గ్రామీణ పేదల ఉపాధి హక్కును దిగమింగిన కేంద్రం తీరు గర్హనీయమని మహాత్మా గాంధీ పేరుని తొలగించడం హేయమైన చర్య అని దానిని యథాతతంగా పునరుద్ధరించాలని,ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,కనీస వేతనం 26,000 ఇవ్వాలని,స్కీం వర్కర్లను కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని,రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని,సిపిఎస్ రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని,ప్రభుత్వ సంస్థల విక్రయాలను ఆపాలని,బ్యాంకు ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.కార్పొరేటు-మతతత్వ కూటమి ప్రభుత్వాలు సాగిస్తున్న కార్మిక ప్రజా కంటక పాలనకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయులు రైతులు వ్యవసాయ కార్మికులతో సహా సమస్త శ్రమజీవులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల నాయకులు మద్దూర్ చిన్న రాముడు, వీరన్న, మధు, విశ్వనాధ్, సులోచన,చేనేత రాష్ట్ర నాయకులు మాధవ స్వామి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు కృష్ణ,హమాలీ, ఆటో యూనియన్, జీపు డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : కార్పొరేట్ల అనుకూల లేబర్ కోడ్ ల అమలుతో కార్మిక వర్గానికి చీకటి రోజులు )

ధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు

0

ధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు

చేతకాకపోతే సెలవు పెట్టి వెళ్ళండి

పెబ్బేర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో

MLA మేఘారెడ్డి

న్యూస్ తెలుగు/వనపర్తి : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని
అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సెలవు పెట్టి వెళ్ళవచ్చునని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పెబ్బేరు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెబ్బేరు మున్సిపాలిటీలో నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో MLA పాల్గొని మాట్లాడారు

మరో వారం రోజుల్లో మనం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుందామని అప్పటిలోగా పలు సమస్యలను గుర్తించాలన్నారు

మున్సిపాలిటీలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఎక్కడ పని చేస్తున్నారన్న వివరాలు ఇవ్వాలని కోరారు

అమృత్ స్కీంకు సంబంధించిన చేపట్టిన పనులు వాటి వివరాలను సైతం గుర్తించాలన్నారు

విద్యుత్ స్తంభాలు, సమస్యలు ఉంటే గుర్తించి త్వరితగతిన పూర్తి చేయాలని నివేదికలు తయారు చేయాలన్నారు

వేసవి దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఇద్దరు ఎక్కడ రాకుండా చేపట్టాల్సిన, పరిష్కరించాల్సిన సమస్యలను సైతం గుర్తించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు

టెండర్లకు సంబంధించి ఎవరెవరు ఏ టెండర్లు వేశారు అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని సూచించారు

మున్సిపాలిటీ టాక్స్ వసూళ్లు అందుకు సంబంధించిన వివరాలు చేద్దాం

రాత్రులు పొద్దు పోయేదాకా నడిపించే హోటళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు

వార్డులలో CC కెమెరాలు ఏర్పాటు చేసేందుకు నివేదికలు తయారు చేయాలని అందుకు సంబంధించి తాను వ్యక్తిగతంగా ప్రతి వార్డులో ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు

వైండింగ్ సంబంధించిన పనులపై దృష్టి సారించి పూర్తిచేసే విధంగా చూడాలని సూచించారు

పట్టణంలోని 12 వార్డులు అభివృద్ధి సాధించాలని పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, కమిషనర్, పెబ్బేరు మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story L: ధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు )

పెన్షన్ల పంపిణీలో కార్యకర్తలందరూ పాల్గొనాలి

0

పెన్షన్ల పంపిణీలో కార్యకర్తలందరూ పాల్గొనాలి

న్యూస్ తెలుగు/వినుకొండ  : బుధవారం జరగనున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో క్లస్టర్, యూనిట్ ఇన్‌ఛార్జులు, మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులతో పాటు ప్రతి కార్యకర్త తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.లబ్ధిదారులకు సకాలంలో పెన్షన్లు అందేలా చూడాలని, దీనిని ఒక సేవా కార్యక్రమంగా భావించి నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని ఆయన సూచించారు. పెన్షన్ పంపిణీ చేస్తున్నప్పటి ఫోటోలను తప్పనిసరిగా “మై టీడీపీ” యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అందరూ సమన్వయంతో వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.(Story : పెన్షన్ల పంపిణీలో కార్యకర్తలందరూ పాల్గొనాలి )

ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌లో ‘శ్రీ విజేత’ సత్తా: రాష్ట్రస్థాయికి 22 మంది ఎంపిక….

0

ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌లో ‘శ్రీ విజేత’ సత్తా: రాష్ట్రస్థాయికి 22 మంది ఎంపిక….

న్యూస్ తెలుగు/వినుకొండ  : గుంటూరులో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ సెకండ్ లెవెల్ పోటీల్లో వినుకొండలోని శ్రీ విజేత హైస్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 22 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం మంగళవారం తెలిపింది. జోనల్ స్థాయిలో సీహెచ్. మణీ శ్రీచరణ్ (86వ ర్యాంకు), యు. వెంకటతేజ (129), ఎ. రేష్మా చౌదరి (175), కె. ఆశ్రిత్ (179), ఎ. సౌజన్య (200) ఉత్తమ ర్యాంకులు సాధించారు. విజేతలను పాఠశాల కరస్పాండెంట్ కావూరి సాయికుమార్, డైరెక్టర్ ఆవులమంద బ్రహ్మయ్య ఘనంగా సత్కరించి మొమెంటోలు అందజేశారు. గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలపడమే తమ లక్ష్యమని కరస్పాండెంట్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.(Story : ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌లో ‘శ్రీ విజేత’ సత్తా: రాష్ట్రస్థాయికి 22 మంది ఎంపిక….)

భక్తులకు ఇబ్బందులు లేకుండా మదమంచిపాడు తిరుణాల ఏర్పాట్లు

0

భక్తులకు ఇబ్బందులు లేకుండా మదమంచిపాడు తిరుణాల ఏర్పాట్లు

న్యూస్ తెలుగు/వినుకొండ  : ఏప్రిల్ 6వ తేదీన మదమంచిపాడు గ్రామంలో జరగనున్న శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల ఏర్పాట్లపై అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు ఆదేశాల మేరకు జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అన్ని శాఖల అధికారులతో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించారు. తిరుణాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ పరిసరాలను వారు స్వయంగా పరిశీలించారు. అనంతరం తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, విద్యుత్, లైటింగ్ మరియు భద్రతా ఏర్పాట్లపై అధికారులతో కూలంకషంగా చర్చించారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు న్యూజిలాండ్ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొని అధికారులతో మాట్లాడారు. తిరుణాల ఏర్పాట్లపై వారికి పలు కీలక మార్గదర్శకాలు అందించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మార్వో, పోలీసు సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు మరియు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.(Story : భక్తులకు ఇబ్బందులు లేకుండా మదమంచిపాడు తిరుణాల ఏర్పాట్లు )

పెరుమాళ్ళపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం, లేగ దూడల ప్రదర్శన

0

పెరుమాళ్ళపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం, లేగ దూడల ప్రదర్శన

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్, పశు సంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పెరుమాళ్ళపల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం, రాష్ట్రీయ గోకుల మిషన్ కింద మేలు జాతి లేగ దూడల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రారంభించగా, న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు పశుసంపద పెంపుపై అధికారులకు సందేశం ద్వారా దిశానిర్దేశం చేశారు. మార్కెట్ యార్డు చైర్మన్ మీసాల మురళి యాదవ్, పశువైద్యాశాల ఏడీ డాక్టర్ ఎన్. శ్రీరాములు మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ వీర్యం లాభాలు, వేసవిలో పశుపోషణ, దూడల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ శిబిరంలో 72 దూడలకు పేడ పరీక్షలు చేసి నులిపురుగుల మందులు, టానిక్ లు పంపిణీ చేశారు. 33 గేదెలకు గర్భకోశ పరీక్షలు, 15 పశువులకు చూడి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డి.సి. ఏడుకొండలు, జి. ఆంజనేయులు, వెంకట్రావు, సీతారామయ్య, పశువైద్యులు డాక్టర్ పి. అమీర్ భాషా, డాక్టర్ డి.వి. శివాజీ, డాక్టర్ మనోజ్, మార్కెట్ యార్డ్ సెక్రటరీ కృష్ణా నాయక్, సిబ్బంది మరియు పశుపోషకులు పాల్గొన్నారు.(Story : పెరుమాళ్ళపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం, లేగ దూడల ప్రదర్శన)

ఆక్రమణల తొలగింపు: ముమ్మరంగా అధికారుల పరిశీలన

0

ఆక్రమణల తొలగింపు: ముమ్మరంగా అధికారుల పరిశీలన

న్యూస్ తెలుగు/వినుకొండ  : పట్టణ అభివృద్ధిలో భాగంగా స్థానిక మార్కాపూర్ రోడ్డులో చేపట్టిన ఆక్రమణల తొలగింపు ప్రక్రియను స్పెషల్ ఆఫీసర్ సిద్ధలింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ కె. శివరామ ప్రసాద్, సీఐ ప్రభాకర్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలో ట్రాఫిక్, ప్రజల రాకపోకలకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని, ఈ విషయంలో ఎలాంటి జాప్యం ప్రదర్శించవద్దని అధికారులను కమిషనర్ ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు సమన్వయంతో వ్యవహరించి తొలగింపు పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రజలు కూడా తమ ఆక్రమణలను తొలగించుకుని, పురపాలక సంఘానికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్‌తో పాటు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, రెవెన్యూ, శానిటేషన్ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.(Story : ఆక్రమణల తొలగింపు: ముమ్మరంగా అధికారుల పరిశీలన )

చదువుతోపాటు సంస్కారం, మానవతా విలువలు నేర్పించాలి

0

చదువుతోపాటు సంస్కారం, మానవతా విలువలు నేర్పించాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : విద్యాపర్తిగా పేరొంది దినదిన అభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం శుభసూచకమని, విద్యార్థులకు విలువలతో కూడిన చదువు, సంస్కారం, తల్లిదండ్రులపై భక్తిశ్రద్ధలు ఉండేలా విద్యా బోధన చేయాలని దాంతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను రాణించేలా ప్రత్యేక దృష్టి సారించాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన “బచ్ పన్” పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన సొంత ప్రాంతం మీద ఉన్న అభిమానంతో ఎంతో కొంత సేవ చేసుకోవాలన్న దృక్పథంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేసిన మీ రాసీపల్లి శ్రీనివాసులు గారికి, ఆయన కుమారులకు Mla అభినందనలు తెలియజేశారూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటును అందిస్తుందని ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ లాంటి అనేక వాటిపై దృష్టి సారించి ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక విద్యాసంస్థలు ఉండేలా చర్యలు చేపడుతుందని అన్నారు . ఈ మధ్యనే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఒక నూతన చట్టం తీసుకువచ్చారని, తల్లిదండ్రులను సరిగా చూసుకోలేని వ్యక్తుల జీతాల నుంచి 10 నుంచి 15 వేల రూపాయలను అందజేసే విధంగా చట్టం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పలువురు నిరుద్యోగులకు అందుకు సంబంధించిన బుక్ మెటీరియల్ ను పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ గారు, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, స్థానిక కౌన్సిలర్. క్రాంతి గౌడ్, పాఠశాల యాజమాన్యం పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : చదువుతోపాటు సంస్కారం, మానవతా విలువలు నేర్పించాలి )

Photo Gallery

error: Content is protected !!