రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా పోటీలలో విజయనగరం మూడువ స్థానం కైవసం
న్యూస్ తెలుగు/విజయనగరం : నంద్యాల జిల్లా నందికోట్నూరు లో ఈ నెల 26, 27 వ తేదిలలో జరిగిన ణవ సబ్ జూనియర్ సెపక్ తక్రా పోటీలలో జిల్లా క్రీడాకారులు మూడువ స్థానం కైవసం చేసుకున్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కె.జి.బి.వి గంట్యాడ పాఠశాలకు చెందిన కుమ్మరి అశ్విని (9వ తరగతి), గండిబోని పవిత్ర (9వతరగతి) జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాదించారు.డిసెంబరు 15వ తేది నుండికేరళ లో జరిగబోయ జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీల్లో పాల్గొంటారు. విజేతలను ఒలంపిక్ అద్యక్ష, కార్యదర్శులు గుర్రాన అయ్యలు, సీహెచ్ వేణుగోపాలరావు , సెపక్ తక్రా సెక్రటరీ ఎంటి రాజేష్ గారు, సైక్లింగ్ అధ్షక్షులు ఎం.ఎస్ .ఎన్ రాజు, సెపక్ తక్రా ట్రజరర్ పి.భవాని, పి.డి సీహెచ్ సీత అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో రాణించి విజయనగరం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.(Story : రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా పోటీలలో విజయనగరం మూడువ స్థానం కైవసం)