డయల్ యువర్ డిఎం ను సద్వినియోగం చేసుకోండి
న్యూస్ తెలుగు\వినుకొండ : ఆర్టిసీ డిపోలో శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ ఆర్టిసి డి.ఎం జే.నాగేశ్వరరావు గురువారం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12:00 గంటల నుండి 1:00 గంట వరకు 99592 25431 నెంబర్ కి ఫోన్ చేసి వినుకొండ నియోజకవర్గంలో ఉన్న తమ ఫిర్యాదులను తెలియజేయాలన్నారు. డిపో పరిధిలో పట్టణం మరియు గ్రామాల నుండి సమయ వేళల్లో మార్పులు, సర్వీసులకు సంబంధించి ప్రయాణికులు తెలపాలన్నారు . సమస్యలతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలని కోరారు.(Story : డయల్ యువర్ డిఎం ను సద్వినియోగం చేసుకోండి )