త్రాగు నీటి నాణ్యతను పరిశీలించిన మున్సిపల్ కమీషనర్
న్యూస్ తెలుగు\వినుకొండ : ప్రజారోగ్యమే ధ్యేయంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి మరియు నీటి నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు. అలాగే అమెనిటీస్ కార్యదర్శులు ఉదయాన్నే నీరు సరఫరా చేయు సమయంలో రెసిడ్యుయల్ క్లోరిన్ పరీక్షలు నిర్వహించి నీటిలో ఎలాంటి కలుషితాలులేవని నిర్ధారించుకున్నాకే నీటి పంపిణీని కొనసాగించేలా మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరులు చర్యలు తీసుకోవాలని, పంప్ హౌస్ వద్ద ఇఎల్ఎస్ఆర్ ల వద్ద పంపిణీ చేయు వాల్వుల యందు సబ్మర్జెడ్ పైపులలోను అపరిశుభ్రతకు తావులేకుండా చూసుకోవాలని, క్రమంతప్పకుండా నీటి పరీక్షలు నిశ్చయంగా జరిపి నివేదికలను కార్యాలయంకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.(Story : త్రాగు నీటి నాణ్యతను పరిశీలించిన మున్సిపల్ కమీషనర్)