ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రైస్ మిల్లులను తరలించండి
న్యూస్ తెలుగు\వనపర్తి : పట్టణ నడిబొడ్డున ఉండి… ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలకు హాని చేస్తున్నందున మిల్లులను తరలించి ప్రజలను కాపాడాలని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అన్నారు. నాలుగవ వార్డ్ లోకనాథ్ రెడ్డి మిల్లు, 22వ వార్డు ఫరీద్ మిల్లు, 28వ వార్డు సత్యనారాయణ మిల్ , 30 వార్డ్ నాగేందర్ మిల్లు, 31 వ వార్డు ప్రతాప్ రెడ్డి మిల్లు, ఊరి నడిబొడ్డిన ఉన్నాయి. వీటిపై చాలా రోజులుగా ప్రజలు పలు విధాలుగా ఫిర్యాదు చేస్తూ, మిల్లులను తొలగించాలని ప్రజావాణి ద్వారా, ఐక్యవేదిక ద్వారా విన్నపాలు చేస్తున్నా చర్యలు తీసుకోవడంలేదనీ, ప్రజలు మళ్లీ ఐక్యవేదికను ఆశ్రయించిన వెంటనే పలు మిల్లులను పరిశీలించిన ఐక్యవేదిక నాయకులు, ప్రతి మిల్లు దగ్గర రోడ్డుపై వెళ్తున్న పాదచారుల, వాహనదారుల కళ్ళల్లో దుమ్ము పడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే ఈ మిల్లుల ను ఊరి బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. లేనియెడల దీనికి సంబంధించిన అధికారులపై వనపర్తికి వస్తున్న ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేయడం జరుగుతుందని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు. ఊరి నడిబొడ్డులో ఉండి ప్రతినిత్యం దుమ్ము వెలువరించే ఈ మిల్లులు ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయని అలాగే ఈ మిల్లుల ద్వారా వచ్చే దుమ్ము దూళి ప్రజల ఇళ్లలోకి, ఇంటి పైకి పడి ప్రతిరోజు గృహినులకు ఇబ్బంది కలిగిస్తుందని ఈ సమస్య తీవ్రతను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలనీ ప్రజలు అఖిలపక్ష ఐక్యవేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు,టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, బి.ఎస్.పి టౌన్ ప్రెసిడెంట్ గంధం భరత్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శరత్ చంద్ర, 4, 22, 28, 30 ,31 వాడు ప్రజలు పాల్గొన్నారు.(Story : ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రైస్ మిల్లులను తరలించండి )