మేజర్ డ్రైన్స్ పూడికతీత పనుల ప్రారంభం
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలో నీటి ముంపు ప్రమాదాన్ని నివారించాటానికి కాలువల దుర్గంధాన్ని తొలిగించాటానికి మరియు వ్యాధులను మోసే దోమల ఉత్పత్తిని వృద్ధిని తగ్గించెందుకు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు ఆదేశానుసారం బీపీఎస్ 2019 మరియు ఎల్ ఆర్ స్ 2020 నియమాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం వినుకొండ పట్టణంకు కేటాయించిన 44.59 లక్షల నిధులతో చేపట్టిన కాలువ పూడికతీత పనులలో భాగంగా రెండవ విడతగా సోమవారం 5 లక్షల రూపాయలతో మేజర్ డ్రైన్స్ పూడికతీత పనులను ఏనుగుపాలెం రోడ్డున ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా 10.5 లక్షలతో కారంపూడి రోడ్ నందు శివయ్య స్థూపం వద్ద నున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి జీవాలయం మీదుగా కరెంటు ఆఫీస్ వరకు మరియు ఫస్ట్ వార్డ్ స్కూల్ వద్ద నుండి బస్టాండ్ వరకూ ప్రధాన రహదారుల వెంబడి మేజర్ డ్రైన్స్ పూడికతీత పనులను పూర్తి చేశారు. తదుపరి రెండో విడత పనులలో భాగంగానే బస్టాండ్ వద్ద నుండి వెన్నెల సూపర్మార్కెట్ ఎదురుగా వున్న ఎనెస్పీ కాలువ వరకు కాలువ పూడికతీత పనులు చేపట్టెదమని కమీషనర్ పేర్కొన్నారు. వ్యాపార సముదాయాల యజమానులు కాలువ మీదనున్న కట్టడములను మరియు అడ్డంకులను తొలగించుకొని మునిసిపల్ అధికారులకు సహకరించి కాలువ పూడికతీత పనులు వేగవంతంగా సజావుగా జరిగేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కోరారు. (Story : మేజర్ డ్రైన్స్ పూడికతీత పనుల ప్రారంభం)