అంగన్వాడిల గ్రాడ్యుటీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది
న్యూస్ తెలుగు/ సాలూరు : అంగన్వాడిల గ్రాడ్యుటీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సోమవారం సచివాలయం నుంచి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని. ఈ కేంద్రాల ద్వారా 5,31,446 గర్భవతి బాలింత తల్లులు మరియు 13,03,384 మంది మూడు సంవత్సరాల లోపు పిల్లలు మరియు 7 లక్షల మంది 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఆరోగ్య మరియు పోషకాహార సేవలు అంగన్వాడీ సిబ్బంది ద్వారా అందజేయడం జరుగుతుందని అన్నారు. అంగన్వాడీ సిబ్బంది అనగా అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు తల్లీ పిల్లల ఆరోగ్యాని కై చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు. ప్రీస్కూల్ కార్యక్రమాల నిర్వహణలో కూడా కార్యకర్తలు చక్కగా పనిచేయుట కేంద్రాల సందర్శనలో గమనించడమైనది అని అన్నారు. ముఖ్యంగా 16-11-24వ తేదీన అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వద్ద వారి సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనలు చేసిన విషయం మా దృష్టికి వచ్చినది. అంగన్వాడీ సిబ్బంది యొక్క ప్రతి సమస్య మీద ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందనే అన్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు మాసాలు మాత్రమే అయినదని దశలవారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటామనీ అన్నారు. సమ్మెలు ఆందోళనల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించబడవని సమ్మెలు చేసి కేంద్రాలు మూసివేయుట ద్వారా గర్భవతి బాలింత మహిళలు మరియు పిల్లలకు అత్యవసరమైన పోషకాహార సేవలు అందించుటకు ఆటంకం కలుగుచున్నదని అన్నారు.. అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యూటీ చెల్లింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది కావున అంగన్వాడీ సిబ్బంది అందరూ సానుకూల దృక్పథంతో ఆలోచించి లబ్ధిదారులకు సేవల జారీలో ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడవలసినదిగా కోరారు. ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలియజేశారు. (Story : అంగన్వాడిల గ్రాడ్యుటీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది)